Share News

Viral Hut Video: ఇది గుడిసె అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. లోపలికి వెళ్లి చూస్తే నివ్వెరపోవాల్సిందే..

ABN , Publish Date - Feb 24 , 2025 | 06:20 PM

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ గుడిసె కనబడుతోంది. బయటి నుంచి చూడడానికి చాలా సాదాసీదాగా ఉంది. కానీ, ఆ మహిళ లోపలికి తీసుకెళ్లి చూపించినది చూస్తే మాత్రం నివ్వెరపోవాల్సిందే. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Hut Video: ఇది గుడిసె అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. లోపలికి వెళ్లి చూస్తే నివ్వెరపోవాల్సిందే..
Viral Hut Video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ గుడిసె (Hut) కనబడుతోంది. బయటి నుంచి చూడడానికి చాలా సాదాసీదాగా ఉంది. కానీ, ఆ మహిళ లోపలికి తీసుకెళ్లి చూపించినది చూస్తే మాత్రం నివ్వెరపోవాల్సిందే. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


ponu1432023 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి తన గుడిసెను చూపిస్తోంది. బయటి నుంచి చూడడానికి అది సాదాసీదాగా ఉంది. లోపలికి వెళ్లి చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ముందు గదిలో ఓ భారీ బెడ్ వేసి ఉంది. దాని ఎదురుగా కూలర్ కూడా ఉంది. ఆ తర్వాత మాస్టర్ బెడ్‌రూమ్ ఉంది. ఆ గదిలో రెండు డబుల్ కాట్స్ ఉన్నాయి. ఆ తర్వాత కిచెన్ కూడా ఉంది. గ్యాస్ స్టవ్‌తో పాటు సామాన్లన్నీ చక్కగా అమర్చి ఉన్నాయి. ఆ గుడిసెను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 50 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 2.6 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ ఇంటిని ఇటుక, సిమెంట్‌తో కాదు.. ప్రేమతో నిర్మించారు``, ``ఆ ఇల్లు అద్భుతంగా ఉంది``, ``డబ్బులు లేకపోయినా అద్భుతమైన సృజనాత్మకత ఉంది``, ``ఉన్నదాంట్లో సంతృప్తి పడడం అంటే ఇదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో ``HOT`` పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..


Rooster: కోడి నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తోంది.. కేరళ వాసి ఫిర్యాదుపై అధికారులు ఏం చేశారంటే..


Baba Ramdev: 59 ఏళ్ల వయసులో ఇంత సామర్థ్యం ఏంటి స్వామి.. పరుగు పందెంలో గుర్రాన్ని మించిన బాబా రాందేవ్..


Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 25 , 2025 | 11:34 PM