Share News

Gautam Gambhir: టీమిండియాకు నయా కోచ్.. గంభీర్ పోస్టు ఊస్టే..

ABN , Publish Date - Jan 01 , 2025 | 05:53 PM

BCCI: ఎన్నో ఆశలు, అంచనాల నడుమ టీమిండియాలోకి వచ్చాడు గౌతం గంభీర్. భారత్‌ను విజయాల బాటలో నడిపిస్తూ మరింత ఎత్తుకు తీసుకెళ్తారని అంతా భావించారు. కానీ అతడి కోచింగ్ జర్నీ మధ్యలోనే ఎగ్జిట్ అయ్యేలా కనిపిస్తోంది.

Gautam Gambhir: టీమిండియాకు నయా కోచ్.. గంభీర్ పోస్టు ఊస్టే..
Gautam Gambhir

IND vs AUS: ఎన్నో ఆశలు, అంచనాల నడుమ టీమిండియాలోకి వచ్చాడు గౌతం గంభీర్. టీమిండియాను విజయాల బాటలో నడిపిస్తూ మరింత ఎత్తుకు తీసుకెళ్తారని అంతా భావించారు. టీ20 వరల్డ్ కప్-2024 నెగ్గి ఊపు మీదున్న మెన్ ఇన్ బ్లూకు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ కప్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీని కూడా అందిస్తాడని నమ్మకం పెట్టుకున్నారు. కానీ అవేవీ వర్కౌట్ కావడం లేదు. లంక సిరీస్‌ నుంచి ఆసీస్ సిరీస్ వరకు గౌతీ కోచింగ్‌లో వన్డేలు, టెస్టుల్లో భారత్ ఘోర ఓటములు చవిచూస్తూ వస్తోంది. రెడ్ బాల్ క్రికెట్‌లోనైతే టీమ్ పెర్ఫార్మెన్స్ రోజురోజుకీ దిగజారుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గౌతీ పోస్టు ఊస్టింగ్‌కు సర్వం సిద్ధమైందని సమచారం. అసలు బీసీసీఐ వేస్తున్న అడుగులు ఏంటి? గంభీర్‌ను రీప్లేస్ చేయబోయే కొత్త కోచ్ ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..


పోస్టుకు గండం?

భారత్‌ వరుస పరాజయాలతో బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కొందరు సీనియర్లతో హెడ్ కోచ్ గంభీర్‌కు జగడం కావడంతో బోర్డు ఈ విషయంలో సీరియస్‌గా ఉందని వినిపిస్తోంది. కోచ్‌గా వచ్చినప్పటి నుంచి సీనియర్‌ ఆటగాళ్లతో గౌతీకి పడకపోవడం, విభేదాలు రోజురోజుకీ మరింత ఎక్కువవడం బోర్డు దృష్టికి వెళ్లిందట. దీంతో ఒకవేళ పరిస్థితి మెరుగవకపోతే గంభీర్‌ను తప్పించే ఆలోచనలో బీసీసీఐ ఉందని సమాచారం. ‘కోచ్ రోల్‌కు గంభీర్‌ ఎప్పుడూ మా మొదటి ప్రయారిటీ కాదు. వీవీఎస్‌ లక్ష్మణ్‌ మా ఫస్ట్ చాయిస్. అయితే కోచింగ్‌కు అతడు విముఖత చూపడంతో గంభీర్‌ను తీసుకున్నాం’ అని బీసీసీఐ పెద్దలు అన్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


రీప్లేస్‌మెంట్ ఎవరు?

నిబంధనలను అతిక్రమిస్తున్నారని గంభీర్‌తో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌ పైనా అసంతృప్తి వ్యక్తం అవుతోందని బోర్డు పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ పరిస్థితిలో గనుక మార్పు రాకపోతే గౌతీ పోస్టుకు ముప్పు తప్పదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను రీప్లేస్ చేయాలని బీసీసీఐ అనుకుంటోందట. ఎలాగైనా ఒప్పించి కోచింగ్ పగ్గాలు అప్పగించాలని భావిస్తోందట. కనీసం టెస్ట్ ఫార్మాట్‌కైనా వీవీఎస్‌ను కోచ్‌గా నియమించాలని చూస్తోందట. ఆస్ట్రేలియా టూర్ ముగిసేసరికి ఈ విషయం మీద క్లారిటీకి రావాలని చూస్తోందట. మిగిలిన మ్యాచులకు జట్టు ఆటతీరు, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, సొంత వ్యవహార శైలి మీదే గంభీర్ కోచింగ్ కెరీర్ ఆధారపడిందని చెబుతున్నారు.


Also Read:

ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రా ఊహకందని ఫీట్.. ఇదెలా సాధ్యం..

టీమిండియాలో ఇంటి దొంగ.. గంభీర్ మాటలు ఎలా బయటకు వచ్చాయి..

టీమ్‌లో నుంచి వెళ్లిపో.. పంత్‌కు గంభీర్ వార్నింగ్

For More Sports And Telugu News

Updated Date - Jan 01 , 2025 | 06:00 PM