Nitish Kumar Reddy Catch: నితీష్ రెడ్డి స్టన్నింగ్ క్యాచ్.. ఈ మధ్య కాలంలో ఇలాంటిది చూసుండరు
ABN , Publish Date - Jan 22 , 2025 | 09:22 PM
India vs England: తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగిన ప్రతిసారి ఏదో ఒక మ్యాజిక్ చేస్తూనే ఉన్నాడు. బంతి, బ్యాట్ ఏది చేతపడితే దాంతో అవతలి జట్లకు ఇచ్చిపడేస్తున్నాడు.

భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌కు మొదటి టీ20లోనే చుక్కలు కనిపిస్తున్నాయి. టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో బట్లర్ సేనను వణికించారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ టీమ్.. మన బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 132 పరుగులకే పరిమితమైంది. అర్ష్‌దీప్ సింగ్ (2/17), హార్దిక్ పాండ్యా (2/42), అక్షర్ పటేల్ (2/22) అదరగొట్టారు. వరుణ్ చక్రవర్తి (3/23) ఇంగ్లండ్ వెన్ను విరిచాడు. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వీటన్నింటి కంటే కూడా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పట్టిన క్యాచ్ హైలైట్‌గా నిలిచింది.
ఏం పట్టాడు భయ్యా!
గ్రౌండ్‌లోకి దిగిన ప్రతిసారి బ్యాటింగ్ లేదా బౌలింగ్‌తో అదరగొడుతున్న నితీష్ రెడ్డి.. ఈసారి ఫీల్డింగ్‌లో తడాఖా చూపించాడు. గాల్లో పక్షిలా ఎగురుతూ అతడు పట్టిన డైవింగ్ క్యాచ్ సూపర్బ్ అనే చెప్పాలి. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (68) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి పట్టుకున్నాడు నితీష్. తక్కువ ఎత్తులో వస్తున్న బంతిపై ఆఖరి వరకు ఫోకస్ ఉంచి చాకచక్యంగా అందుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక మరింత విధ్వంసకరంగా ఆడుతున్న బట్లర్ క్యాచ్ వదిలితే భారత్‌కు ప్రమాదకరంగా మారేది. ఈ క్యాచ్ చూసిన అభిమానులు.. ఇది క్యాచ్ ఆఫ్ ది సిరీస్ అంటూ తెలుగోడ్ని మెచ్చుకుంటున్నారు. కాగా, ఛేజింగ్ మొదలుపెట్టిన భారత్.. ప్రస్తుతం 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 41 పరుగులతో ఉంది. విజయానికి 90 బంతుల్లో ఇంకా 88 పరుగులు కావాలి.
ఇవీ చదవండి:
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. ఇలాంటోడ్నా మిస్ చేసుకుంది
చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్.. భువీ, బుమ్రాను దాటేశాడు
షమీకి బీసీసీఐ షాక్.. ఇంగ్లండ్‌తో తొలి టీ20కి ముందు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి