MS Dhoni: సీఎస్‌కేను ఓడించిన ధోని.. చిన్న తప్పుతో..
ABN , Publish Date - Mar 29 , 2025 | 10:19 AM
IPL 2025: ఐపీఎల్ ఫేవరెట్స్‌లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌కు అనూహ్య షాక్ తగిలింది. ఫస్ట్ మ్యాచ్‌లో విక్టరీతో నయా సీజన్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన ధోని టీమ్.. రెండో పోరులో ఆర్సీబీ చేతుల్లో ఘోర పరాభవం మూటగట్టుకుంది.

క్రికెట్ అంటే ఫిజికల్ గేమ్ మాత్రమే కాదు.. మెంటల్ గేమ్ కూడా. బరిలోకి దిగాక ప్రతి ఆటగాడు చురుగ్గా ఉండాల్సిందే. శరీరంతో పాటు అతడి బుర్ర కూడా పాదరసం కంటే వేగంగా పని చేయాలి. కెప్టెన్, సీనియర్ ప్లేయర్లు ఈ విషయంలో మరింత అలర్ట్ ఉండాలి. జట్టు విజయం కోసం ఎప్పటికప్పుడు వ్యూహాలను చెక్ చేసుకుంటూ, అవసరమైతే మారుస్తూ, కావాలంటే తామే బాధ్యత తీసుకొని రంగంలోకి దూకాలి. ఇది మిస్ అయినప్పుడు అనూహ్య పరాజయాలు తప్పవు. నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇదే విధమైన ఓటమి ఎదురైంది. దీనికి సీఎస్‌కే కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు మాజీ సారథి ఎంఎస్ ధోని కూడా కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తెలిసే చేశాడా..
చెపాక్ ఫైట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 రన్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన సీఎస్‌కే ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 146 పరుగులు చేసింది. విజయానికి 50 పరుగుల దూరంలో ఆగిపోయింది. రచిన్ రవీంద్ర (41) తప్ప చెన్నై బ్యాటర్లంతా ఫెయిలయ్యారు. అయితే చివర్లో వచ్చిన ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) భారీ షాట్లతో ఆడియెన్స్‌ను అలరించాడు. కానీ అప్పటికే ఆ టీమ్ ఓటమి ఖరారైంది. దీంతో మాహీ బ్యాటింగ్‌లో 9వ డౌన్‌లో ఎందుకు వచ్చాడు.. తెలిసే ఈ తప్పు చేశాడా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పొజిషన్ మారిస్తే అపోజిషన్ ఔట్
ధోని ఆరో స్థానంలోనో లేదా ఏడో స్థానంలోనో వచ్చి ఉంటే.. దూబె, జడేజా లాంటి బ్యాటర్లకు మరింత కాన్ఫిడెన్స్ దొరికేది. మాహీ ఆ 30 పరుగులేవో పైఆర్డర్‌లో వచ్చి చేసి ఉంటే.. ఇతర ఎండ్‌లో ఉన్న బ్యాటర్ కూడా రాణిస్తే సీఎస్‌కే రిథమ్ అందుకునేది. ధోని చివరి వరకు క్రీజులో నిలబడితే మ్యాచ్ ఫినిష్ అయ్యేది. ఇంజ్యురీ వల్ల ఇంకా పూర్తిగా బ్యాటింగ్ చేయలేని స్థితిలో ఉన్నాడని అనుకున్నా.. ఎలాగూ 15 నుంచి 20 బంతులు ఎదుర్కోక తప్పదు. అలాంటప్పుడు అదేదో కాస్త ముందే వచ్చి ఆడితే సరిపోయేది కదా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అంతా అయిపోయాక ఫోర్లు, సిక్సులు కొడితే ఎవరికి ఉపయోగం అని సీరియస్ అవుతున్నారు. ధోని చేతుల్లో మ్యాచ్ ఉందని తెలిసినా.. లేట్‌గా రావడం కరెక్ట్ కాదని, ఫినిష్ చేసే సామర్థ్యం తనలో ఉందని తెలిసినా ఎందుకీ తప్పు చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సీఎస్‌కేను ఆర్సీబీ కాదు.. ధోనీనే ఓడించాడని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
కోహ్లీపై ధోని DRS అప్పీల్.. రివ్యూ ఏమైందంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి