Share News

RCB vs CSK Chepauk Pitch: ఓటమికి సాకులు వెతుకుతున్న చెన్నై.. ప్లేట్ ఫిరాయించారుగా..

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:48 PM

IPL 2025: ఓటమికి సాకులు వెతుక్కుంటోంది చెన్నై సూపర్ కింగ్స్. పిచ్ అప్పటిలా లేదంటూ ఆ టీమ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

RCB vs CSK Chepauk Pitch: ఓటమికి సాకులు వెతుకుతున్న చెన్నై.. ప్లేట్ ఫిరాయించారుగా..
CSK

చెన్నై సూపర్ కింగ్స్‌కు చెపాక్ స్టేడియం ఎదురులేని కోటగా చెప్పొచ్చు. అక్కడ ఆ టీమ్‌ను ఓడించడం టాప్ టీమ్స్‌కు కూడా కష్టమే. గింగిరాలు తిరిగే ఆ వికెట్ మీద సీఎస్‌కే బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. స్లో వికెట్‌పై ఎలా ఆడాలనే ట్రిక్ కేవలం చెన్నై ఆటగాళ్లకే తెలుసు. అందుకే చెపాక్‌ను తిరుగులేని కోటగా తయారు చేసుకుంది ఎల్లో ఆర్మీ. అయితే ఇప్పుడు అక్కడ ఆ జట్టు పప్పులు ఉడికే పరిస్థితులు కనిపించడం లేదు. ఆర్సీబీ చేతుల్లో ఎదురైన పరాభవంతో చెపాక్‌లో సీఎస్‌కేను ఓడించడం పెద్ద మ్యాటర్ కాదనే కాన్ఫిడెన్స్‌ ఇతర టీమ్స్‌కూ పాకుతోంది.


తప్పించుకుంటే ఎలా..

సీఎస్‌కే స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగితే, 170 ప్లస్ స్కోరు బాదితే గెలుపు ఖాయమనే భరోసాను ఇచ్చింది ఆర్సీబీ. దీంతో ఇన్నాళ్లూ చెపాక్ తమకు అడ్డాగా చెబుతూ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. ఇక్కడి పిచ్ గతంలోలా లేదని స్వయంగా ఆ టీమ్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రెస్ మీట్‌లో చెప్పుకొచ్చాడు. దీంతో ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏం వచ్చింది.. పిచ్ సహకరించకపోతే గెలవలేరా.. ఒకప్పుడు అదే తమ బలమని చెప్పి, ఇప్పుడు వికెట్‌ను సాకుగా చూపడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బెంగళూరు టీమ్ ఈడెన్ గార్డెన్స్, చెపాక్ లాంటి ఇతర వేదికలకు వెళ్లి గెలిచిందని.. అలాంటప్పుడు సొంత మైదానంలోని పిచ్ తమకు అనుకూలంగా లేదంటూ దాటవేత ధోరణికి దిగడం చాంపియన్‌ టీమ్‌కు కరెక్టా అనే విమర్శలు వస్తున్నాయి.


నో స్పిన్

ఈ పిచ్ పేసర్లకు సహకరిస్తోందని, అప్పట్లా అంత స్పిన్ అవ్వట్లేదని అన్నాడు ఫ్లెమింగ్. ఒకప్పటిలా పూర్తిగా టర్నింగ్ ట్రాక్ కాదని.. చెపాక్ పిచ్ మారిపోయిందన్నాడు సీఎస్‌కే కోచ్. పిచ్ స్వభావం ఎలా ఉందో దాన్ని బట్టే ఆడాల్సిన అవసరం ఉందన్నాడు ఫ్లెమింగ్. ఓటమికి బ్యాటింగే కారణమని చెప్పలేమని, హిట్టర్లు లేరనే మాట వాస్తవం కాదన్నాడు. తమ జట్టులో బలమైన హిట్టర్లు ఉన్నారని.. అయితే ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్‌కు దిగి ఉంటే ఫలితం మరోలా ఉండేదని స్పష్టం చేశాడు ఫ్లెమింగ్.


ఇవీ చదవండి:

బయటపడిన సీఎస్‌కే గుట్టు

సీఎస్‌కేను ఓడించిన ధోని.. చిన్న తప్పుతో..

కోహ్లీపై ధోని DRS అప్పీల్.. రివ్యూ ఏమైందంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2025 | 12:52 PM