Share News

Varun Chakaravarthy: బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. ఇలాంటోడ్నా మిస్ చేసుకుంది

ABN , Publish Date - Jan 22 , 2025 | 08:38 PM

IND vs ENG: భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌కు తొలి టీ20లోనే గట్టి షాకులు తగులుతున్నాయి. మన బౌలర్ల ముందు నిలబడేందుకు కూడా ఆ జట్టు బ్యాటర్లు జంకుతున్నారు.

Varun Chakaravarthy: బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. ఇలాంటోడ్నా మిస్ చేసుకుంది
Varun Chakaravarthy

ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్.. ఇలా టీమ్ నిండా పించ్ హిట్టర్లే. బంతిని బాదడంలో ఒకర్ని మించిన వాళ్లు మరొకరు. అందునా టీ20 మ్యాచ్. దీంతో టీమిండియాకు కష్టమేనని అంతా అనుకున్నారు. అయితే అంతా దీనికి రివర్స్‌లో జరిగింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లీష్ బ్యాటర్లను వణికిస్తున్నారు భారత బౌలర్లు. ఒక ఎండ్‌లో పేసర్లు బుల్లెట్ డెలివరీస్‌తో భయపెడుతుంటే.. మరో ఎండ్‌లో స్పిన్నర్లు గింగిరాలు తిరిగే బంతులతో అపోజిషన్ టీమ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఎక్కువ క్రెడిట్ మాత్రం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఇవ్వాల్సిందే.


వాటే బౌలింగ్!

మొదటి టీ20లో వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. బంతిని బొంగరంలా తిప్పుతూ ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను షేక్ చేశాడు. బట్లర్ (68), హ్యారీ బ్రూక్ (17)తో పాటు లియామ్ లివింగ్‌స్టన్ (0)ను ఔట్ చేశాడు వరుణ్. ఇందులో లివింగ్‌స్టన్, బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. బంతి పడటం అమాంతం స్పిన్ అయి లోపలకు దూసుకురావడంతో బ్యాట్ పెట్టినా అడ్డుకోలేకపోయారు ప్రత్యర్థి బ్యాటర్లు. క్వాలిటీ స్పిన్, డెడ్లీ లెంగ్త్‌తో బ్యాటర్లను కట్టిపడేశాడు వరుణ్. 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ చూసిన నెటిజన్స్.. ఇలాంటోడ్ని చాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు సెలెక్ట్ చేయలేదు? బీసీసీఐ బ్లండర్ మిస్టేక్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. అతడు ఉన్న ఫామ్, బౌలింగ్ రిథమ్‌కు అడ్డొచ్చే బ్యాటరే లేడని అంటున్నారు. అనవసరంగా మంచి బౌలర్‌ను మిస్ చేసుకున్నారని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్.. భువీ, బుమ్రాను దాటేశాడు

షమీకి బీసీసీఐ షాక్.. ఇంగ్లండ్‌తో తొలి టీ20కి ముందు..

భారత్-ఇంగ్లండ్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ అందులోనే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 22 , 2025 | 08:47 PM