ప్రావిడెంట్ ఫండ్ ఇప్పించాలి
ABN , Publish Date - Mar 18 , 2025 | 10:42 PM
పౌరసరఫరాల సంస్థలో హమాలీలుగా పనిచేసి చనిపోయి, రిటైర్డ్ అయిన వారితోపాటు మానుకున్న వారికి వెంటనే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఇప్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు.

ఒంగోలు కలెక్టరేట్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : పౌరసరఫరాల సంస్థలో హమాలీలుగా పనిచేసి చనిపోయి, రిటైర్డ్ అయిన వారితోపాటు మానుకున్న వారికి వెంటనే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఇప్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మె చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. స్థానిక పౌరసరఫరాలశాఖ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ హమాలీల జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ధర్నాకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు బిందె ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ధర్నాలో సుబ్బారావు మాట్లాడుతూ నాలుగేళ్ల నుంచి ఇప్పటి వరకు సంస్థలో హమాలీలుగా పనిచేసి డ్యూటీలో ఉండి అనారోగ్య కారణాలతో, ప్రమాదంలో చనిపోయిన తొమ్మిది మంది కార్మికులకు రావాల్సిన పీఎఫ్ చెల్లించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు దారుణమని విమర్శించారు. ఆయా సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆ సంస్థ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాకు సీఐటీయూ నాయకులు మహేష్, బంగా సుబ్బారావు, టి. రాము, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు సురే్‌షలు మద్దతు తెలిపారు. ధర్నాలో గోపాలరావు, శ్రీనివాసరెడ్డి, శేషయ్య, సుబ్బారావు, నాగరాజు, బోశయ్య, వెంకటేశ్వరరెడ్డి, శ్రీను, రంగయ్య, గంగయ్య పాల్గొన్నారు.