Share News

అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , Publish Date - Mar 18 , 2025 | 10:45 PM

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కే సుమన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదులముడి మధుబాబులు కోరారు.

 అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలి
రెవెన్యూ భవన్‌ వద్ద నినాదాలు చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

సెర్ప్‌, మెప్మా ఉద్యోగుల మాదిరి హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కే సుమన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదులముడి మధుబాబులు కోరారు. స్థానిక రెవెన్యూ భవన్‌లో మంగళవారం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి బొప్పరాజు చినరాయుడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సుమన్‌, మధుబాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో మెప్మా, సెర్ప్‌లలో పనిచేసే ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించిందన్నారు. ఆ విధంగానే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కీలక శాఖల్లో పనిచేస్తున్నందున వారందరికి హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆప్కాస్‌ను రద్దు చేయడాన్ని వారు ఖండించారు. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమిస్తే దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల ఆప్కా్‌సను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాఘవరావు, నాగమల్లేశ్వరరావు, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 10:45 PM