Share News

MS Dhoni: ధోనీ రియాక్షన్ టైమ్ 0.12 సెకెన్లు.. అవాక్కైన మాజీ క్రికెటర్లు..

ABN , Publish Date - Mar 24 , 2025 | 02:48 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, మైదానంలోకి దిగి చాలా రోజులు అయినప్పటికీ ధోనీలో మెరుపు వేగం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. తాజాగా చెన్నైలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ మెరుపు స్టంపింగ్ చూసి దిగ్గజ ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు.

MS Dhoni: ధోనీ రియాక్షన్ టైమ్ 0.12 సెకెన్లు.. అవాక్కైన మాజీ క్రికెటర్లు..
MS Dhoni

మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం కేవలం ఐపీఎల్ (IPL 2025) మాత్రమే ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, మైదానంలోకి దిగి చాలా రోజులు అయినప్పటికీ ధోనీలో మెరుపు వేగం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. తాజాగా చెన్నైలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ మెరుపు స్టంపింగ్ చూసి దిగ్గజ ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. ధోనీ స్కిల్‌పై ప్రశంసలు కురిపించారు (Dhoni Stumping).


నూర్ అహ్మద్ వేసిన బంతిని ఆడేందుకు కాస్త ముందుకు వెళ్లిన సూర్య కుమార్‌ను ధోనీ మెరుపు వేగంతో స్టంపౌట్ చేశాడు. బంతి చేతుల్లోకి వచ్చిన 0.12 సెకెన్లలోనే వికెట్లను పడగొట్టాడు. ఆ మెరుపు స్టంపింగ్ చూసి సూర్య కుమార్ యాదవ్ మాత్రమే కాదు.. మాజీ ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్.. ధోనీపై ప్రశంసలు కురిపించాడు.* ధోనీలో ఇప్పటికీ ఫైర్ తగ్గలేదు. ఆ స్టంపింగ్ అద్భుతం *అంటూ హెడెన్ వ్యాఖ్యానించాడు. ధోనీ చేసిన స్టంప్ అత్యద్భుతమైనదని నూర్ అహ్మద్ కూడా వ్యాఖ్యానించాడు.


మహీ భాయ్ లాంటి ఓ వ్యక్తి వికెట్ల వెనుక ఉంటే గొప్ప మద్దతుగా ఉంటుందని, స్పిన్నర్లకు ఓ వరం అని నూర్ అహ్మద్ వ్యాఖ్యానించాడు. ఓ కొత్త బౌలర్ బౌలింగ్‌లో కీపింగ్ చేయాల్సి వస్తే ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తాడని, ఆ బౌలర్ చేత బంతులు వేయించి కీపింగ్ ప్రాక్టీస్ చేస్తాడని మాజీ బౌలర్ పియూష్ చావ్లా తెలిపాడు. ధోనీ చూపు అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

SRH vs RR: ఇషాన్ కిషన్ మెరపు శతకం.. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే


Virat Kohli - Rinku Singh: కోహ్లిని రింకూ సింగ్ అవమానించాడా.. వేదిక మీద షేక్ హ్యండ్ ఇవ్వకపోవడంతో చర్చ


MS Dhoni: నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా.. సీఎస్కే వాళ్లు లాక్కెళ్తారు: ఎంఎస్ ధోనీ


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2025 | 02:48 PM