Share News

గాయత్రి జోడీకి నిరాశ

ABN , Publish Date - Mar 23 , 2025 | 03:45 AM

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌ పోరు పూర్తిగా ముగిసింది. బరిలో మిగిలిన సింగిల్స్‌ షట్లర్‌ శంకర్‌ ముత్తుస్వామి సుబ్రమణియన్‌...

గాయత్రి జోడీకి నిరాశ

శంకర్‌ కూడా..

స్విస్‌ ఓపెన్‌

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌ పోరు పూర్తిగా ముగిసింది. బరిలో మిగిలిన సింగిల్స్‌ షట్లర్‌ శంకర్‌ ముత్తుస్వామి సుబ్రమణియన్‌, డబుల్స్‌ జోడీ పుల్లెల గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ పోరాటానికి తెరపడింది. శనివారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 9వ ర్యాంకర్‌ ద్వయం గాయత్రి/ట్రీసా 21-15, 15-21, 12-21తో చైనాకు చెందిన ప్రపంచ నెంబర్‌వన్‌ జోడీ లూ షెంగ్‌ షూ/టాన్‌ నింగ్‌ చేతిలో పరాజయం పాలైంది. ఇక పురుషుల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన తమిళనాడు కుర్రాడు శంకర్‌ అదేజోరును తర్వాతి రౌండ్‌ కొనసాగించలేకపోయాడు. క్వార్టర్‌ఫైనల్లో శంకర్‌ 10-21, 14-21తో ఫ్రాన్స్‌కు చెందిన పొపోవ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు.

ఇవి కూడా చదవండి..

IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే

IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 03:45 AM