Abhishek Sharma : మోడల్‌తో అభిషేక్ డేటింగ్?
ABN , Publish Date - Feb 04 , 2025 | 04:33 AM
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్‌తో చివరి టీ20లో సూపర్ సెంచరీ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో అతడి వ్యక్తిగత విషయాల గురించి నెట్‌లో వెతకడం ఎక్కువైంది. ఈ క్రమంలో అతడు మోడల్ లైలా ఫైజల్‌తో డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు

న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్‌తో చివరి టీ20లో సూపర్ సెంచరీ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో అతడి వ్యక్తిగత విషయాల గురించి నెట్‌లో వెతకడం ఎక్కువైంది. ఈ క్రమంలో అతడు మోడల్ లైలా ఫైజల్‌తో డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లైలా..ప్రముఖ లగ్జరీ దుస్తుల బ్రాండ్ యజమాని అని తెలుస్తోంది. వీరిద్దరూ చనువుగా ఉన్న ఫొటోలు కూడా నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, అభిషేక్ గతంలో తాన్యా సింగ్ అనే మోడల్‌తో ప్రేమాయణం నడిపాడనే వార్తలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. నిరుడు ఫిబ్రవరిలో ఆమె ఆత్మహత్య చేసుకోగా..అభిషేక్‌ను పోలీసులు విచారించారని సమాచారం.