IPL 2025: ఢిల్లీ, లక్నో హెడ్ టూ హెడ్..విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..
ABN , Publish Date - Mar 24 , 2025 | 05:45 PM
ఐపీఎల్ 18వ సీజన్‌లో నాలుగో మ్యాచ్ కాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మొదలు కానుంది. అయితే ఈ మ్యాచుల హెడ్ టూ హెడ్, గెలుపు ప్రిడిక్షన్ వంటి అంశాల గురించి ఇప్పుడు చూద్దాం.

18వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) నాల్గో మ్యాచ్ కాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మొదలు కానుంది. ఈ మ్యాచ్ విశాఖపట్నం వైఎస్సార్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 7:00 గంటలకు టాస్ జరుగుతుంది. ఈ క్రమంలో ఇరు జట్లు కూడా ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు హెడ్ టూ హెడ్ ఆడిన మ్యాచులలో ఏ జట్టు ఎక్కువగా గెలిచింది. ఇప్పుడు ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్..
ఐపీఎల్ 2008 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మొత్తం ఐదు మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో లక్నో 3 మ్యాచ్‌ల్లో గెలువగా, ఢిల్లీ క్యాపిటల్స్ 2 సార్లు విజయం సాధించింది. అయితే, గత సీజన్ గురించి మాట్లాడుకుంటే, రెండు జట్లు మొత్తం 2 సార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ రెండు సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఈసారి మాత్రం గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 54 శాతం గెలిచేందుకు అవకాశం ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు 46 శాతం ఛాన్సుంది.
ఈ స్టేడియంలో ప్రధానంగా..
విశాఖపట్నం వైఎస్సార్ స్టేడియం పిచ్‌పై మొత్తం 15 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 8 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఛేదించిన జట్టు 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇది కాకుండా టాస్ గెలిచిన జట్టు 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, టాస్ ఓడిన జట్టు 7 మ్యాచ్‌ల్లో గెలిచింది.
లైవ్ ఎక్కడంటే..
రెండు జట్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూడాలనుకుంటే, మీరు టీవీ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. మీరు JioHotstarలో కూడా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. కానీ దీని కోసం మీరు మీ మొబైల్ ఫోన్‌లో JioHotstar యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవాలి.
DC, LSG ప్రాబబుల్ ప్లేయింగ్ XI
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడే అవకాశం ఉన్న XI: అక్షర్ పటేల్ (కెప్టెన్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, మోహిత్ శర్మ.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఆడే అవకాశం ఉన్న XI: రిషబ్ పంత్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), అర్షిన్ కులకర్ణి, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్.
ఇవి కూడా చదవండి:
IPL 2025: CSKపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు..వీడియో వైరల్
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News