Share News

IPL 2025: స్టేడియంలోకి ఈ వస్తువులు తీసుకెళ్లొద్దు

ABN , Publish Date - Mar 21 , 2025 | 06:12 PM

Prohibited Items IPL 2025: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ మోత మోగనుంది. కోల్‌కతా వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లోని క్రికెట్ స్టేడియంలలో ఈ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మ్యా్చ్ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది.. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి..

IPL 2025: స్టేడియంలోకి ఈ వస్తువులు తీసుకెళ్లొద్దు
IPL 2025

IPL Season 18: ఐపీఎల్ సీజన్ 18 శనివారం నుంచి ప్రారంభ కానుంది. తొలి మ్యాచ్‌ కోల్‌కతా వేదికగా జరుగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా 9 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం చేసింది. మరోవైపు పోలీసులు భద్రతాపరంగా అనేక చర్యలు చేపడుతున్నారు. దాదాపు 2,700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 300 మంది పోలీసులును సిద్ధం చేశారు లా అండ ఆర్డర్‌లో 1,218 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐపీఎల్ బందోబస్త్ కోసం 12 బెటాలియన్లు, 2 అక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ బృందాలు, 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్‌ను ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. స్టేడియం ఎంట్రెన్స్ వద్ద స్నిఫర్ డాగ్స్‌తో పాటు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించనున్నారు. ఇక మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్ బృందాలు ఏర్పాటు చేశారు. ఐదు చోట్ల స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.


పోలీసుల సూచనలు

ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ చూసేందుకు వచ్చే ఆడియన్స్‌కి పోలీసులు కీలక సూచనలు చేశారు. మ్యాచ్‌ చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో పలు జాగ్రత్తలు పాటించాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ అడ్వైజరీని పాటించాలి స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటూనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్ ఉపయోగించాలని కోరారు. అన్నింటికంటే ముఖ్యంగా దొంగలు చెలరేగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తు తీసుకోవాలని సూచించారు.

IPL-Traffic-Map.jpg


ఈ వస్తువులు తీసుకెళ్లవద్దు

ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే ఆడియన్స్‌కు మరో కీలక సూచన కూడా చేశారు పోలీసులు. అదేంటంటే.. ఆడియన్స్ తమ వెంట కొన్ని వస్తువులు తీసుకురావొద్దని స్పష్టం చేశారు. వాటిపై నిషేధం విధించారు.


నిషేధిత వస్తువులు ఇవే

  • కెమెరాలు ఇతర రికార్డింగ్ వస్తువులు తీసుకెళ్లడం నిషేధం.

  • బ్లూటూడ్ హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్, ఇయర్ పాడ్స్ తీసుకెళ్లవద్దు.

  • సిగరెట్, లైటర్స్, అగ్గిపెట్టెలు తీసుకెళ్లవద్దు.

  • తుపాకులు, కత్తులు, ఇతర ప్రమాదకర వస్తువులు తీసుకెళ్లవద్దు.

  • వాటర్ బాటిల్స్, మద్య పానియాలు, కూల్ డ్రింక్స్ తీసుకెళ్లవద్దు.

  • పెట్స్, యానిమల్స్‌ ప్రవేశం లేదు.

  • తినుబండాగారాలు తీసుకెళ్లవద్దు.

  • బ్యాక్‌ప్యాక్స్, హ్యాండ్ బ్యాగ్స్‌కి అనుమతి లేదు.

  • ల్యాప్‌ట్యాప్స్‌, సెల్ఫీ స్టిక్స్ అనుమతి లేదు.

  • హెల్మెట్స్, బైనాక్యూలర్స్ అనుమతి లేదు.

  • ఫైర్ క్రాకర్స్ తీసుకెళ్లడం నిషేధం.

  • డ్రగ్స్ నిషేధం.

IPL-2025-Prohibition-List.jpg


Also Read:

ఉప్పల్‌లో సన్‌రైజర్స్ మ్యాచులు.. టికెట్స్ ఎలా బుక్..

హార్దిక్‌ను బకరా చేసిన బీసీసీఐ.. అందర్నీ వదిలేసి ఒక్కడ్నే..

ఛాహల్-ధన శ్రీ డైవర్స్ పిటిషన్‌లో ఏముందంటే..

For More Sports News and Telugu News..

Updated Date - Mar 21 , 2025 | 06:13 PM