Virat Kohli - Rinku Singh: కోహ్లీని రింకూ సింగ్ అవమానించాడా.. వేదిక మీద షేక్ హ్యండ్ ఇవ్వకపోవడంతో చర్చ
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:44 PM
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో కీలక పాత్ర పోషించాడు. శ్రేయా ఘోషల్, దిశా పటానీ, కరణ్ ఔజ్లా తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అయితే ఈ వేడుకల్లో కోహ్లీ, రింకూ సింగ్‌కు సంబంధించిన ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది.

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ 2025 (IPL 2025) సిద్ధమైంది. శనివారం సాయంత్రం కోల్‌కతాలో ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ (Shah Rukh Khan) ఈ వేడుకల్లో కీలక పాత్ర పోషించాడు. శ్రేయా ఘోషల్, దిశా పటానీ, కరణ్ ఔజ్లా తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అయితే ఈ వేడుకల్లో కోహ్లీ (Virat Kohli), రింకూ సింగ్ (Rinku Singh)కు సంబంధించిన ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియో ఆధారంగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి (Viral Video).
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో షారూక్ ఖాన్ తనదైన శైలిలో హోస్టింగ్ చేసి అందరినీ అలరించాడు. విరాట్ కోహ్లీని వేదిక పైకి ఆహ్వానించి అతడితో మాట్లాడాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఓ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. ఆ తర్వాత రింకూ సింగ్‌ను షారూక్ వేదిక పైకి ఆహ్వానించాడు. రింకూ సింగ్ వేదిక పైకి వచ్చి షారూక్‌తో కరచాలనం చేశాడు. పక్కనే ఉన్న కోహ్లీ చేయి అందించే ప్రయత్నం చేయగా రింకూ పట్టించుకోకుండా పక్కకు వెళ్లి నెల్చున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రింకూ కావాలనే కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. రింకూ ఉద్దేశపూర్వకంగానే కోహ్లీని అవమానించాడా? చూసుకోకుండా వెళ్లిపోయాడా? అనే చర్చ జోరుగా సాగుతోంది. కోహ్లీ అభిమానులు మాత్రం రింకూపై విమర్శలు గుప్పిస్తున్నారు. కోహ్లీ లాంటి లెజెండ్‌ను పట్టించుకోకపోవడం తప్పు అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా.. సీఎస్కే వాళ్లు లాక్కెళ్తారు: ఎంఎస్ ధోనీ
IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే
IPL 2025: బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..