Share News

IPL 2025: టాస్ గెలిచిన ఢిల్లీ.. మొదట బ్యాటింగ్ చేసేది ఎవరంటే

ABN , Publish Date - Mar 24 , 2025 | 07:27 PM

విశాఖపట్నం వేదికగా మరి కాసేపట్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ మొదట బ్యాటింగ్ చేయబోతోంది.

IPL 2025: టాస్ గెలిచిన ఢిల్లీ.. మొదట బ్యాటింగ్ చేసేది ఎవరంటే
LSG vs DC

విశాఖపట్నం వేదికగా మరి కాసేపట్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (DC), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (LSG) మధ్య మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ మొదట బ్యాటింగ్ చేయబోతోంది. వైజాగ్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. రాత్రి సమయంలో మంచు పడుతుందనే అంచనాతో ఢిల్లీ సెకెండ్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. (DC vs LSG).


గతంలో ఢిల్లీ టీమ్‌కు నాయకత్వం వహించిన రిషభ్ పంత్ ఈ సీజన్‌లో లఖ్‌నవూ టీమ్‌ను ముందుకు నడిపించబోతున్నాడు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ టీమ్‌కు కెప్టెన్సీ వహిస్తున్నాడు. మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ బౌలర్లను ఎదుర్కొని ఢిల్లీ బ్యాటర్లు ఏ మాత్రం స్కోరు చేస్తారో చూడాలి.


తుది జట్లు:

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: ఐదెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, దిగ్వేశ్ సింగ్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్

ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, సమీర్ రజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్‌దీప్ యాదవ్, మోహత్ శర్మ, ముకేశ్ కుమార్

ఇవి కూడా చదవండి..

MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన


Harbhajan Singh: నల్ల ట్యాక్సీ అంటూ ఆర్చర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు.. హర్భజన్‌పై తీవ్ర ఆగ్రహం


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2025 | 07:27 PM