Share News

రోహిత్‌తో ఆటను ఆస్వాదిస్తా..: కోహ్లీ

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:56 AM

భారత క్రికెట్‌ జట్టులో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలది ప్రత్యేక స్థానం. దశాబ్దాలుగా ఇద్దరూ కలిసి ఆడుతుండడంతో పాటు ఎన్నో విజయాలు అందించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రోహిత్‌తో కలిసి...

రోహిత్‌తో ఆటను ఆస్వాదిస్తా..: కోహ్లీ

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టులో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలది ప్రత్యేక స్థానం. దశాబ్దాలుగా ఇద్దరూ కలిసి ఆడుతుండడంతో పాటు ఎన్నో విజయాలు అందించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రోహిత్‌తో కలిసి ఆడడాన్ని ఎంతగానో ఆస్వాదించినట్టు విరాట్‌ తెలిపాడు. ‘ఇద్దరం దాదాపు ఒకేసారి జట్టులోకి వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాది సుదీర్ఘ ప్రయాణం. కలిసి ఆడాం.. కలిసి నేర్చుకున్నాం. ఎన్నో ఆలోచనలను పంచుకున్నాం. అలాగే ఒకరిపై మరొకరం నమ్మకం ఉంచుతూ జట్టు విజయాల కోసం తోడ్పడ్డాం. ఈ క్రమంలో మా మధ్య ఎన్నో మధుర స్మృతులున్నాయి. వాటన్నింటినీ ఎంజాయ్‌ చేశాను’ అని విరాట్‌ పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 07 , 2025 | 04:56 AM