BCCI Spin Bowling Coach: స్పిన్ బౌలింగ్ కోచ్ కావలెను
ABN , Publish Date - Mar 29 , 2025 | 07:09 AM
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీఓఈ)లో స్పిన్ బౌలింగ్ కోచ్ పట్ల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సాయిరాజ్ బహుతులే రాజీనామా చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చేరడంతో కొత్త కోచ్‌పై బాధ్యతలు ఉంటాయి

బెంగళూరు: సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీఓఈ)లో పనిచేసే స్పిన్ బౌలింగ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటివరకు ఆ బాధ్యతల్ని నిర్వర్తించిన సాయిరాజ్ బహుతులే రాజీనామా చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరాడు. మరోవైపు అన్ని వయస్సు విభాగాల స్పిన్ బౌలర్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే బాధ్యత కొత్త కోచ్‌పై ఉంటుందని బోర్డు పేర్కొంది. కనీసం 75 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, మూడేళ్ల కోచింగ్ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు వచ్చే నెల 10 వరకు గడువుంది.