Share News

Shardul Thakur: వేలంలో అన్‌సోల్డ్.. బరిలోకి దిగిన తర్వాత మాత్రం అద్భుత ప్రదర్శన

ABN , Publish Date - Mar 27 , 2025 | 10:23 PM

ఐపీఎల్ మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ పట్ల ఎవరూ ఆసక్తి చూపించలేదు. అతడికి ఎవరూ తీసుకోలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. చివరకు అతడి బేస్ ప్రైస్ అయిన రూ.2 కోట్లకు లఖ్‌నవూ తీసుకుంది. లఖ్‌నవూ తీసుకున్నప్పటికీ తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరికీ అంచనాలు లేవు.

Shardul Thakur: వేలంలో అన్‌సోల్డ్.. బరిలోకి దిగిన తర్వాత మాత్రం అద్భుత ప్రదర్శన
Shardul Thakur

ఐపీఎల్ (IPL 2025) మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) పట్ల ఎవరూ ఆసక్తి చూపించలేదు. అతడికి ఎవరూ తీసుకోలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. చివరకు అతడి బేస్ ప్రైస్ అయిన రూ.2 కోట్లకు లఖ్‌నవూ తీసుకుంది. లఖ్‌నవూ (LSG) తీసుకున్నప్పటికీ తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరికీ అంచనాలు లేవు. అయితే లఖ్‌నవూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆవేశ్ ఖాన్, ఆవేశ్ ఖాన్ గాయాలతో దూరం కావడంతో శార్దూల్‌కు తొలి మ్యాచ్‌లో అవకాశం దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో శార్దూల్ రెండు వికెట్లు తీశాడు.


ఇక, ఈరోజు హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (LSG vs SRH) శార్దూల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఆరు వికెట్లు దక్కించుకుని టాప్ బౌలర్‌గా నిలిచాడు. కాగా, ఠాకూర్‌ ఐపీఎల్‌లో వంద వికెట్లను కూడా పూర్తి చేసుకున్నాడు. తాజా మ్యాచ్‌లో ఠాకూర్.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, మహ్మద్ షమీలను అవుట్ చేశాడు. మహ్మద్ షమీ వికెట్ శార్దూల్‌కు వందో ఐపీఎల్ వికెట్. శార్దూల్ బౌలింగ్ ప్రదర్శనతో లఖ్‌నవూ టీమ్ గెలిచే స్థానంలో నిలిచింది.


ఇవి కూడా చదవండి..

Kavya Maran: అయ్యో.. వావ్.. మ్యాచ్ సమయంలో కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే..


Riyan Parag: ఆ కుర్రాడికి రూ.10 వేలు ఇచ్చాడా.. రియాన్ పరాగ్ కాళ్లు మొక్కడంపై నెటిజన్లు కామెంట్లు ఏంటంటే


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2025 | 10:23 PM