Share News

మళ్లీ దబిడి దిబిడే!

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:17 AM

వరుసగా మూడు సీజన్లలో పేలవ ప్రదర్శనతో చివరి స్థానాలకే పరిమితమవుతూ వస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. 2024 సీజన్‌లో ఒక్కసారిగా దుమ్మురేపింది. దూకుడైన ఆటకు కేరాఫ్‌ అడ్ర్‌సగా...

మళ్లీ దబిడి దిబిడే!

ఫుల్‌ జోష్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

వరుసగా మూడు సీజన్లలో పేలవ ప్రదర్శనతో చివరి స్థానాలకే పరిమితమవుతూ వస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. 2024 సీజన్‌లో ఒక్కసారిగా దుమ్మురేపింది. దూకుడైన ఆటకు కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలిచే హైదరాబాద్‌.. లీగ్‌ చరిత్రలోనే అత్యధికంగా 287/3 స్కోరు సాధించింది. అలవోకగా భారీ స్కోర్లు సాధిస్తూ ఫైనల్‌కు చేరింది. కానీ, తుది పోరులో మాత్రం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓడి రన్నర్‌పగా నిలిచింది. అయితే, సన్‌రైజర్స్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ మాత్రం అభిమానులను ఉర్రూతలూగించింది. 2016లో టైటిల్‌ సాధించిన హైదరాబాద్‌.. 2018 ఫైనల్లో ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకొంది. అయితే, వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ను సన్‌రైజర్స్‌ భారీ ధరకు కొనుగోలు చేసి అతడికే జట్టు పగ్గాలు అప్పజెప్పింది. జట్టు మళ్లీ పుంజుకోవడానికి ఈ సాహసోపేత నిర్ణయం ఓ రకంగా దోహదం చేసింది. మూడు సీజన్లలో అట్టర్‌ఫ్లాపైన హైదరాబాద్‌.. 2024 లీగ్‌లో తమ బ్యాటింగ్‌ విన్యాసాలతో ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. క్లాసెన్‌ కూడా బౌలర్లను వదిలిపెట్టలేదు. దీంతో వేలానికి ముందే కమిన్స్‌, హెడ్‌, అభిషేక్‌, నితీశ్‌ కుమార్‌లను రిటైన్‌ చేసుకొని కోర్‌ టీమ్‌ను సిద్ధం చేసుకొంది.


ఈసారి ఇషాన్‌ కిషన్‌ను కూడా తీసుకున్నారు. ఇక, ఆల్‌రౌండర్‌గా నితీశ్‌ కుమార్‌ అంతర్జాతీయ క్రికెట్‌ అనుభవం లాభించనుంది. కమిన్స్‌తోపాటు పవర్‌ప్లేలో వికెట్లు పడగొట్టగలిగే అనుభవం ఉన్న షమిని వేలంలో కొనుగోలు చేయడంతో పేస్‌ విభాగం కూడా మెరుగ్గానే ఉంది. ఆడమ్‌ జంపా, రాహుల్‌ చాహర్‌లు స్పిన్‌ విభాగాన్ని నడిపించనున్నారు. గాయం నుంచి కోలుకొన్న కమిన్స్‌ నేరుగా ఐపీఎల్‌ ఆడుతుండగా.. షమి ఫిట్‌నెస్‌ కొంత ఆందోళన కలిగిస్తోంది. జట్టు బ్యాటర్లు: ట్రావిస్‌ హెడ్‌, అధర్వ తైడే, అభినవ్‌ మనోహర్‌, అనికేత్‌ వర్మ, సచిన్‌ బేబీ; వికెట్‌ కీపర్లు: క్లాసెన్‌, ఇషాన్‌ కిషన్‌; ఆల్‌రౌండర్లు: అభిషేక్‌ శర్మ, నితీశ్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, కమిందు మెండిస్‌, వియాన్‌ ముల్డర్‌; బౌలర్లు: కమిన్స్‌ (కెప్టెన్‌), షమి, రాహుల్‌ చాహర్‌, జంపా, సిమ్రన్‌జీత్‌, జీషన్‌ అన్సారీ, ఉనాద్కట్‌, ఇషాన్‌ మలింగ.

ఇవి కూడా చదవండి..

Yuzvendra Chahal-Dhanashree: ఛాహల్-ధనశ్రీ వర్మకు విడాకులు.. మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు..

పాండ్యాకు మెంటల్ టార్చర్

మరిన్ని క్రీడాతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2025 | 03:17 AM