అభిమాని అనుకుని పోలీసులు ఆపేశారు
ABN , Publish Date - Feb 05 , 2025 | 05:41 AM
ఇంగ్లండ్‌తో తొలి వన్డే కోసం భారత జట్టు ఇక్కడకు చేరుకొంది. ఆటగాళ్లందరూ టీమ్ బసచేస్తున్న హోటల్‌కు బస్సులో వచ్చారు. జట్టులో అందరూ తమ లగేజీని తీసుకెళ్తున్న...

నాగ్‌పూర్: ఇంగ్లండ్‌తో తొలి వన్డే కోసం భారత జట్టు ఇక్కడకు చేరుకొంది. ఆటగాళ్లందరూ టీమ్ బసచేస్తున్న హోటల్‌కు బస్సులో వచ్చారు. జట్టులో అందరూ తమ లగేజీని తీసుకెళ్తున్న సమయంలో టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘుకు మాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. పోలీసులు అతడిని అభిమానిగా భావించి హోటల్‌లోకి వెళ్లకుండా అడ్డుకొన్నారు. తాను జట్టు సభ్యుడినని అతడు పోలీసులకు వివరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఎవరు చెప్పారో తెలియదు కానీ.. పోలీసులు నవ్వుతూ అతడిని వదిలేశారు. రఘు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
ఇదీ చదవండి:
భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఫుల్ డీటెయిల్స్ మీ కోసం..
స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షాకింగ్ డెసిషన్
బ్యాటింగే చేస్తానంటే సరిపోదు.. అభిషేక్‌కు హర్భజన్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి