Smart Lock System: దొంగలను పట్టించిన స్మార్ట్ లాక్ సిస్టమ్.. ఎలాగంటే..
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:29 PM
నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో చోరీకి వచ్చిన దొంగలను స్మార్ట్ లాక్ సిస్టమ్ పట్టించింది. అయితే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, దొంగలను ఎలా పట్టించిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం అనేక నగరాల్లో చోరీలు, దొంగతనాల వంటి ఘటనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పండుగలు లేదా జాతరల కోసం ఫ్యామిలీతోపాటు అనేక ప్రాంతాలకు వెళ్లే క్రమంలో వారి ఇంటికి తాళాలు వేసి వెళ్లినా కూడా భద్రత ఉండటం లేదు. దొంగతనం చేసే వారు ఆయా తాళాలను పగులగొట్టి వారి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం సహా ఇతర వస్తువులను దోచుకెళ్తున్నారు. అయితే ఇలాంటి చోరీలను అరికట్టేందుకు ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ లాక్ సిస్టమ్ (Smart Lock System) అందుబాటులో ఉంది. ఈ సాంకేతికత ద్వారా చోరీలను కట్టడి చేయడమే కాదు, దొంగలను కూడా పట్టుకోవచ్చు.
చోరీ చేసేందుకు వచ్చి..
ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తన ఇంట్లో స్మార్ట్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని ఇంటి అన్ని తలుపులు, గేట్లు సహా అన్ని విండోలకు అలారంను అనుసంధానించాడు. ఈ క్రమంలో తన ఇంటి సెక్యూరిటీని కఠినంగా మార్చుకుని తన స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసుకున్నాడు. ఆ నేపథ్యంలోనే ఒక రోజు వారు ఊరేళ్లగా అదే సమయంలో పలువురు దుండగులు వారి ఇంట్లోకి చోరీ చేసేందుకు వచ్చారు. ఆ క్రమంలో గేట్ లాక్ పగులకొట్టేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో స్మార్ట్ లాక్ ద్వారా తలుపును తీయడానికి ప్రయత్నించిన దొంగలు ఫెయిలయ్యారు. వారికి ఆ టెక్నాలజీ గురించి తెలియకపోవడం వల్ల, వారు గేటును ఓపెన్ చేయలేకపోయారు.
రంగంలోకి పోలీసులు
ఆ క్రమంలోనే ఎవరో తెలియని వారు తన ఇంటి గేట్ ఓపెన్ చేస్తున్నారని స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకున్న ఇంటి ఓనర్ సెక్యూరిటీ అలారమ్‌ను యాక్టివేట్ చేసి, పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే రంగలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకున్నారు. దీంతో స్మార్ట్ లాక్ సిస్టమ్ తనకు ఎంతో ఉపయోగపడిందని ఆ వ్యక్తి అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, స్మార్ట్ లాక్, సెక్యూరిటీ సిస్టమ్‌లపై ప్రజలు అవగాహన కల్గి ఉండాలని పోలీసులు కూడా సూచించారు.
స్మార్ట్ లాక్ సిస్టమ్ ఎలా పనిచేస్తాయి
స్మార్ట్ లాక్ సిస్టమ్‌లు ప్రస్తుతం చాలాచోట్ల వినియోగిస్తున్నారు. వీటిలో ప్రధానంగా ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కానర్, పిన్ కోడ్, బ్లూటూత్ ఆధారిత అప్లికేషన్లు, గూగుల్ అసిస్టెంట్, యాంజెలే హోమ్ లేదా అమెజాన్ అలెక్సా వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. వాయిస్ సర్వీసులు లేదా కోడ్స్ ఉపయోగించడం ద్వారా గేట్స్ లేదా డోర్లు పనిచేస్తాయి. ఇవి మంచి సెక్యూరిటీ విధానాలను కల్గి ఉంటాయి. ఈ స్మార్ట్ లాక్ సిస్టమ్‌లలో ముఖ్యమైన అంశం ఏంటంటే దొంగతనాల కోసం వచ్చే వ్యక్తులను ఇంట్లోకి రావడాన్ని నిరోదిస్తాయి. ఆ క్రమంలో స్మార్ట్ లాక్‌లు అలెర్ట్ పంపిస్తాయి. మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు యూజర్‌కు తెలియజేస్తాయి. ఆ వ్యక్తి ఇంట్లో లేకపోయినా కూడా యూజర్ స్వయంగా తన ఫోన్ ద్వారా మానిటర్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
WhatsApp: మీ వాట్సాప్ మెసేజ్‌లు వారు చదువుతారా.. మార్క్ జుకర్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు
ChatGPT: వినియోగదారుల కోసం చాట్‌జీపీటీ నుంచి వీడియో ఇంటరాక్షన్ ఫీచర్
WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..
Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..
Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...
For More Technology News and Telugu News