Share News

లొద్దిగూడ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్తాం

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:45 PM

మండలంలోని డబోలి పంచాయతీలో గల లొద్దిగూడ ఆదివాసుల సమస్యలను ఆదిలాబాద్‌ ఎంపీ గోడాం నగేష్‌ దృష్టికి తీసుకెళ్తానని బీజేపీ మండల అధ్యక్షుడు మేస్రాం జ్ఞానేశ్వర్‌ ను సోమవారం తెలిపారు. జ్ఞానేశ్వర్‌ లొద్దిగూడను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

లొద్దిగూడ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్తాం
లొద్దిగూడలోని ఆదివాసులతో బీజేపీ మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌

బీజేపీ మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌

జైనూర్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని డబోలి పంచాయతీలో గల లొద్దిగూడ ఆదివాసుల సమస్యలను ఆదిలాబాద్‌ ఎంపీ గోడాం నగేష్‌ దృష్టికి తీసుకెళ్తానని బీజేపీ మండల అధ్యక్షుడు మేస్రాం జ్ఞానేశ్వర్‌ ను సోమవారం తెలిపారు. జ్ఞానేశ్వర్‌ లొద్దిగూడను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆదివాసులతో ఆయన సమావేశం అయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్య ల్ని ఆదిలాబాద్‌ ఎంపీ గోడాం నగేష్‌ దృష్టికి తీసు కెళ్లి వాటిని త్వరగా పరి ష్కరిస్తామన్నారు. తమకు రాకపోకలకు రోడ్డు సదు పాయం లేదన్నారు. తాగు నీటి కోసం వాగు పక్కకు చె లిమె ఏర్పాటు చేసి కలుషి త నీటిని తాగుతున్నామని వారు వివరించారు. వరా ్షకాలంలో వ్యాధులు వస్తే ఎడ్ల బండి ద్వారా సమీప ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని వారు వాపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇళ్లలోనే నివసిస్తున్నామని అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయని పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల్ని ఎంపీతో పాటు అధికారు లకు వివరించి తగు న్యాయం చేస్తామని బీజేపీ నాయకులు వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాథోడ్‌, ఆదివాసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:45 PM