కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
ABN , Publish Date - Feb 18 , 2025 | 03:53 AM
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం సోమవారం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. అదేవిధంగా కేసీఆర్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఫోన్‌చేసి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఆయురారోగ్యాలతో జీవిస్తూ.. ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు పలువురు పార్టీ నేతలు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.