Share News

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:28 PM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని మిట్టపల్లి గ్రామంలో వాటర్‌ షెడ్‌ యాత్రను ప్రారంభిం చారు. నీటి సంరక్షణ ప్రాధాన్యతపై గ్రామంలో విద్యార్థులు, అధికారు లతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
వాటర్‌ షెడ్‌ యాత్రను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జైపూర్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని మిట్టపల్లి గ్రామంలో వాటర్‌ షెడ్‌ యాత్రను ప్రారంభిం చారు. నీటి సంరక్షణ ప్రాధాన్యతపై గ్రామంలో విద్యార్థులు, అధికారు లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వాతావరణ సమతుల్యత నీటి సంరక్షణ మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. మొక్కలు నాటడం ద్వా రా వాతావరణ సమతుల్యత సాధించవచ్చన్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం, పాఠశాల పరిసరాలను హరితమయంగా మార్చడం ద్వారా విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించవచ్చన్నారు. ప్రతి ఒక్కరు మొక్క లు నాటి సంరక్షించాలన్నారు. నీటి సంరక్షణ, ప్రాథమిక భూసారం పెం పొందించి వ్యవసాయాన్ని మెరుగు పరిచే లక్ష్యంగా వాటర్‌ షెడ్‌ ప్రాజె క్టులను ముందుకు తీసుకువెళ్లడం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్ర మంలో డీఆర్‌డీవో కిషన్‌, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ సీఈవో గణ పతి, మండల తహసీల్దార్‌ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీ వో శ్రీపతి బాపురావు, ఏపీఎం రాజ్‌కుమార్‌, ఏపీవో బాలయ్య, మహిళ సంఘాల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 11:28 PM