Share News

Mini Food Labs Hyderabad: హైదరాబాద్‌లో మినీ ఫుడ్‌ ల్యాబ్స్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:56 AM

రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ఫుడ్‌ సేఫ్టీ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రజలకు అందుబాటులో మినీ ఫుడ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

Mini Food Labs Hyderabad: హైదరాబాద్‌లో మినీ ఫుడ్‌ ల్యాబ్స్‌

  • ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆహార నాణ్యత ప్రయోగశాలలు

  • గ్రేటర్‌ పరిధిలో ప్రతీ జోన్‌కు ఒకటి

  • ప్రజలే ఆహార నమూనాలను తీసుకెళ్లి పరీక్షలు చేయించేలా ఏర్పాట్లు

  • జీహెచ్‌ఎంసీ అధికారులతో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సమీక్ష

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఆహార భద్రత, నాణ్యత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫుడ్‌ సేఫ్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాక, ప్రజలకు మరింత చేరు వ చెయ్యడమే లక్ష్యంగా మినీ ఫుడ్‌ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు సహా రాష్ట్రంలో జరిగే ఆహార వ్యాపారంలో 60 శాతానికిపైగా హైదరాబాద్‌లోనే జరుగుతుంది. దీంతో ఈ మినీ ఫుడ్‌ ల్యాబ్‌లను తొలుత రాష్ట్ర రాజధాని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో ఒక్కో మినీ ఫుడ్‌ ల్యాబ్‌ ఏర్పాటు కానుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఈ మినీ ఫుడ్‌ ల్యాబ్‌లు సామాన్యులకూ అందుబాటులో ఉండనున్నాయి. ఏదైనా ఆహారంపై అనుమా నం ఉంటే వాటి నమూనాలను ప్రజలు స్వయంగా మినీ ఫుడ్‌ ల్యాబ్‌లకు తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు. ఆయా ఆహార పదార్థాల నాణ్యతను తెలుసుకోని తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ ఆహార పదార్థాల నాణ్యతను ఎక్కడ పరీక్షిస్తారు ? వారిని సంప్రదించాలి ? సంబంధిత అధికా రులు ఎవరు? తదితర విషయాలపై ప్రజలకు అవగాహన లేదు. ఇప్పుడు మినీ ఫుడ్‌ ల్యాబ్స్‌ అందుబాటులోకి వస్తే ఫుడ్‌సేఫ్టీ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కానుంది. జీహెచ్‌ఎంసీ సహకారంతో మినీ ఫుడ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, ఫుడ్‌ సేఫ్టీ కమిషర్‌ కర్ణన్‌ ఆ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. మినీ ల్యాబ్‌ల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ సహకారంతో స్థలాలు ఎంపిక చేయాలని ప్రతిపాదించారు.


కాగా, ఏడాదిన్నరగా హైదరాబాద్‌, పరిసరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు, డెయిరీలలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు(ఎ్‌ఫఎ్‌సవో) విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆహార భద్రతపై ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. ఫుడ్‌ బిజినెస్‌ చేసే వ్యాపారులకు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ రిజిస్ట్రే షన్‌ లైసెన్స్‌లు జారీ చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 23 మంది ఎఫ్‌ఎ్‌సవోలే ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 80 ఎఫ్‌ఎ్‌సవో పోస్టులుండగా అందులో 20కిపైగా ఖాళీగా ఉన్నాయి. కేరళలో 160 ఎఫ్‌ఎ్‌సవో పోస్టులతో పోలిస్తే తెలంగాణలో సగం మంది ఎఫ్‌ఎ్‌సవోలు కూడా లేరు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎఫ్‌ఎ్‌సవో పోస్టుల సంఖ్యను భారీగా పెంచాలని సర్కారు నిర్ణయించింది. ఇక, ప్రస్తుతం నాచారంలో ఏకైక ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఉంది. గ్రేటర్‌ పరిఽధిలో అధికారులు సేకరించిన ఫుడ్‌ శాంపిళ్లు అన్నీ కూడా అక్కడికే పంపుతున్నారు. నెలకు 600-700 నమూనాలను అక్కడ పరీక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇది కారు లాంటి గేట్..

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి

Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ

Updated Date - Mar 26 , 2025 | 03:56 AM