High Court: ఖురాన్ స్ఫూర్తిని విస్మరించిన వక్ఫ్ బోర్డు
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:17 AM
వక్ఫ్‌బోర్డు తీరును హైకోర్టు తప్పుబట్టింది. వక్ఫ్‌బోర్డు దివ్య ఖురాన్ స్ఫూర్తిని విస్మరించిందని, పేదల పక్షాన పనిచేయడం మానేసిందని ఆక్షేపించింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ వ్యాఖ్య
పాదరక్షలు విడిచి ఖురాన్‌లోని అంశాల పఠనం
ఇబాదత్‌ఖానా స్వాధీనంలో జాప్యంపై అసహనం
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌బోర్డు తీరును హైకోర్టు తప్పుబట్టింది. వక్ఫ్‌బోర్డు దివ్య ఖురాన్ స్ఫూర్తిని విస్మరించిందని, పేదల పక్షాన పనిచేయడం మానేసిందని ఆక్షేపించింది. హైదరాబాద్ పాతబస్తీలోని ఇబాదత్‌ఖానా(ఆధ్యాత్మిక కేంద్రం) నిర్వహణను ప్రత్యక్ష నిర్వహణలోకి తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తంచేసింది. ప్రస్తుతం ఇబాదత్‌ఖానా యాజమాన్యం అక్రమంగా కొనసాగుతోందని, దానిని స్వాధీనం చేసుకుని ప్రత్యక్ష నిర్వహణలోకి తీసుకోవాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కొత్త కమిటీని వేయాలని సూచించింది.
ఆ కమిటీలో షియాఅక్బరీ, ఉసూలీ శాఖల నుంచి సమానంగా సభ్యులను నియమించాలని తెలిపింది. ఈ ఆదేశాలను వక్ఫ్‌బోర్డు అమలు చేయలేదు. కమిటీ సభ్యులు కొందరు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వక్ఫ్‌బోర్డు ఖురాన్ స్ఫూర్తిని పాటించడం లేదని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఖురాన్‌లోని కొన్ని పేరాలను న్యాయమూర్తి పాదరక్షలు విడిచి చదివి వినిపించారు. రివ్యూ పిటిషన్‌ను కొట్టివేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News