Share News

అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:48 AM

అందరి సహ కారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్‌ అన్నారు.

అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం
బ్రహ్మోత్సవాల్లో సహకరించిన దాతలను సన్మానిస్తున్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, మార్చి 28 ( ఆంధ్రజ్యోతి ): అందరి సహ కారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్‌ అన్నారు. ధర్మపురి క్షేత్రంలో జరిగిన లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో సహకరించిన దాతలు, అధికా రులు, ప్రజాప్రతినిఽధులు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, అర్చకులు, ఉద్యోగులకు ఆలయం పక్షాన స్థానిక టీటీడీ ధర్మశాల ఆవరణలో సన్మాన కార్యక్ర మాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మో త్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవం తం చేయడంలో సహకరించిన ప్రతీఒక్కరిని అభినంది స్తున్నానని తెలిపారు. సన్మాన కార్యక్రమంలో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మోత్స వాల్లో వివిధ శాఖల అధికారులు ఎంతో సమన్వయం తో పనిచేశారన్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో తనకు మాట్లాడే అవకాశం లభించడం చాలా ఆనందకరమైన విషయమన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సుల వల్లే తనకు ఈ అవకా శం దొరికిందని ఆయన తెలిపారు. లక్ష్మీనరసింహ స్వామి ధర్మకర్తల మండలి చైర్మన్‌ జక్కు రవీందర్‌ మాట్లాడుతూ 13రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో సహకరించిన ప్రతిఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌కుమార్‌ సహకారంతో ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు. అంతకు ముందు బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి సేవను మోసిన స్థానిక బోయలకు రూ. 25 వేలు, దివిటి మోసే నాయీబ్రాహ్మణులకు ఐదు వేల రూపాయలను వ్యక్తిగతంగా ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌ అందించారు. మండలంలోని పెద్దనక్కలపేట గ్రామానికి చెందిన భూక్యా శ్రావణి పవర్‌ లిఫ్టింగ్‌ 52 కేజీల విభాగంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆమెను శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ జక్కు రవీందర్‌, ఆలయ ఈవో సంక టాల శ్రీనివాస్‌, జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌, ధర్మపు రి సీఐ రాంన ర్సింహారెడ్డి, ఎస్‌ఐలు ఉదయ్‌కుమార్‌, శ్రీధర్‌రెడ్డి, ఉమాసాగర్‌, సతీష్‌, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:48 AM