Share News

రాజీవ్‌ యువవికాస్‌ పథకంపై సంబరాలు

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:26 PM

రాజీవ్‌ యువ వికాస్‌ పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ మంగళవారం గోదావరిఖని చౌరస్తాలో నియోజకవర్గ అధ్యక్షుడు నాజీ ముద్దీన్‌ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపి ణీ చేశారు. ముఖ్య అతిథిగా రామగుండం నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొంతల రాజేష్‌ హాజరై మాట్లాడుతూ ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ, నిరుద్యోగ యువత కోసం రాజీవ్‌ వికాస్‌ పథకం కింద ఉపాధి కల్పించడానికి ముఖ్యమంత్రి ప్రారంభించడం హర్షనీయమన్నారు.

రాజీవ్‌ యువవికాస్‌ పథకంపై సంబరాలు

కళ్యాణ్‌నగర్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రాజీవ్‌ యువ వికాస్‌ పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ మంగళవారం గోదావరిఖని చౌరస్తాలో నియోజకవర్గ అధ్యక్షుడు నాజీ ముద్దీన్‌ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపి ణీ చేశారు. ముఖ్య అతిథిగా రామగుండం నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొంతల రాజేష్‌ హాజరై మాట్లాడుతూ ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ, నిరుద్యోగ యువత కోసం రాజీవ్‌ వికాస్‌ పథకం కింద ఉపాధి కల్పించడానికి ముఖ్యమంత్రి ప్రారంభించడం హర్షనీయమన్నారు.

రాష్ట్రంలో 5లక్షల మం ది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో రూ.6వేల కోట్లతో స్వయం ఉపాధి పథకం కింద అర్హులైన నిరుద్యోగ యువతీయువకులను ఎంపిక చేస్తారని చెప్పారు. జూన్‌ 2న 5లక్షల మంది లబ్ధిదారులను ప్రకటి స్తారని, నియోజకవర్గానికి 4వేల నుంచి 5వేల మంది నిరు ద్యోగులకు ఉపాధి కల్పించనున్నట్టు, ఈ పథకాన్ని నిరుద్యో గులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టణ అధ్య క్షుడు తిప్పారపు శ్రీనివాస్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సతీష్‌, నాయకులు దీటి బాలరాజు, ముస్తాఫా, నాయిని ఓదెలు, కొప్పుల శంకర్‌, బొమ్మక రాజేష్‌, చుక్కల శ్రీనివాస్‌, దూళికట్ట సతీష్‌, గట్ల రమేష్‌, పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:26 PM