నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:12 AM
జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 12,30వరకు జరిగే పరీక్షలను ప్రశాం తంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో పరీక్ష రాసే 7,393మంది విద్యార్థుల కోసం 41పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.

పెద్దపల్లి కల్చరల్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 12,30వరకు జరిగే పరీక్షలను ప్రశాం తంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో పరీక్ష రాసే 7,393మంది విద్యార్థుల కోసం 41పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో రెగ్యులర్‌గా పరీక్ష రాసే విద్యార్థుల్లో బాలురు 3703, బాలికలు 3690మొత్తం 7393మంది పరీక్షలు రాయ నున్నారు. 41పరీక్ష కేంద్రాలలో ఏడు రూట్లను చేరవే యడానికి నిర్ణయించారు. ఆరుగురు రూట్ ఆఫీసర్లు, ఆరుగురు అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లు మూడు టీంలు ప్లయింగ్ స్క్వాడ్‌లతోపాటు 586మంది ఎనిమిది ఇన్విజిలెటర్లను కేటాయించారు. ప్రైవేటుగా పరీక్షలు రాసే అభ్యర్థుల్లో 8మంది బాలురు 9మంది బాలికలు మొత్తం 17మంది రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్య లు చేపట్టారు. తాగునీరు, మున్సిపల్, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు సకాలంలో హాజరయ్యే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహిం చాలన్నారు. ఉదయం ప్రత్యేక బస్సులను నడపాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారామెడికల్ సిబ్బంది, ఆశాకార్యకర్తలు అందు బాటులో ఉండి చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ, స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో ఎక్కడ మాస్‌కాపీంగ్ జరగకుండా జాగ్రత్త తీసుకుం టున్నారు. ప్రశ్నపత్రాల తరలింపుకు అవసరమైన పోలీసు భద్రత ఉండేవిధంగా చూడాలన్నారు. పరీ క్షలు ముగిసిన తర్వాత పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా సమాధాన పత్రాలు పంపుటకు కట్టుదిట్టమైన చర్య లు చేపట్టారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేసే విధంగా చర్యలు చేపట్టారు.
కోల్‌సిటీటౌన్ (ఆంధ్రజ్యోతి): రామగుండం మండ లంలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రాలలో సుమారు 2500 మంది విద్యార్థులు పరీక్ష హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకార్యలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలి పారు. ఉదయం 9గంటలకే విద్యార్థులు పరీక్ష కేం ద్రాలకు చేరుకోవాలని, 9.30గంటల తరువాత 5 నిమి షాలు గ్రేస్ సమయం ఉంటుందని, తరువాత హాజ రయ్యే వారిని అనుమతించమని అధికారులు పేర్కొ న్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల విషయంలో హాల్‌టికెట్లు ఇవ్వకపోతే చర్యలు తీసు కుంటామని, హాల్‌టికెట్లు విషయంలో మీసేవ, ఆన్ లైన్ సెంటర్లలో తీసుకుని వచ్చినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్...
పదో తరగతి పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. 144 సెక్షన్ అమలులో ఉంటుంది. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సహాయం, పరీక్షా కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు ఉండేలా ఏర్పాటు చేశాం. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ను అనుమతి లేదు. పరీక్షకు హాజరయ్యే ఇన్విజిలేటర్లు సైతం సెల్‌ఫోన్‌ను బయటనే ఉంచాలని, మొత్తం 100 మందికి పైగా ఇన్విజిలేటర్లు, ప్రతి సెంటర్‌కు చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులు విధులు నిర్వహిస్తారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణలు జరుగుతాయి.