రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:10 AM
రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు.

భగత్‌నగర్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా, బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికి ఈ నెల 28న నిరసన దీక్ష చేపడుతున్నామన్నారు. కలెక్టరేట్ వద్ద రెండు గంటల నిరసన దీక్షా కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు వాస్తవ పరిస్థితులకు పొంతనలేకుండా ఉందన్నారు. జిల్లాలో వేలాది మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిలపు రమేష్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, యాదగిరి, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, పార్లమెంట్ కన్వినర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, కరివేద మహపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజిరెడ్డి పాల్గొన్నారు.