లింగనిర్ధారణ, అబార్షన్లు చేయవద్దు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:43 AM
జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో లింగనిర్ధారణ, అబార్షన్లు చేయవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు.

సిరిసిల్ల టౌన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో లింగనిర్ధారణ, అబార్షన్లు చేయవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ(గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధి త చట్టం)అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లా డుతూ స్కానింగ్ సెంటర్లలో ఫామ్ ఆడిట్లను ప్రతినెల ప్రోగ్రాం ఆఫీసర్ తనిఖీ లు నిర్వహించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో ధరలు పట్టికను, ఇతర సర్టిఫికెట్ల ను గోడలపై ప్రదర్శించాలన్నారు. స్కానింగ్‌కు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందు లు కలగకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో పీవోఎంహెచ్‌ఎన్ డాక్టర్ అంజలినాఆల్ర్ఫేడ్, డాక్టర్ శోభారాణి, ప్రోగ్రాం ఆఫీసర్ అనిత, లీగల్ అడ్వై జర్ శాంతి కుమార్ శుక్ల, ఎన్జీవో ప్రెసిడెంట్ చింతోజు భాస్కర్, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, హెచ్‌వో బాలయ్య పాల్గొన్నారు.