Share News

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ..

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:32 AM

జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హు లైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్‌ సందీప్‌కుమా ర్‌ ఝా అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ..

సిరిసిల్ల మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హు లైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్‌ సందీప్‌కుమా ర్‌ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లాలో ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా జరగాలన్నారు. ప్రజాస్వామ్య విలువలు నెలకొల్పేందుకు ఓటరు జాబితా కీలకమన్నారు. సరైన ఓటరు జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యం నిలబ డుతుందని అన్నారు. ఎన్నికల సమయం లో కాకుండా ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎప్పటికప్పు డు సమీక్ష చేసుకోవాలని అన్నారు. ఓటరు జాబితాలోని పేర్లు తొలగించే సమయంలో తప్పనిసరిగా మార్గదర్శకాలు పాటించాలని అన్నారు. ఓటరుజాబితాలో డబుల్‌ఎంట్రీల తొలగింపుచర్యలు తీసుకుంటామని, ఇతర రాష్ట్రాల్లో కూడా కొంతమందికి ఓట్లు ఉన్న ట్లు వస్తున్న ఫిర్యాదులను జాతీయ ఓటరు సర్వీస్‌ పోర్టల్‌ వివరాలు పరిశీలిస్తూ పరి ష్కరిస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ఓటరు జాబితా సవరణ చేయడం జరుగుతుందని అన్నారు. ఓటరు నమోదులో తప్పుడు సమాచారం అందిస్తే నేరమని మోసపూరితంగా రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే అధారాలతో అందిస్తే చర్యలు తీసుకుంటామని అన్నా రు. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో 477182 మంది ఓటర్లు ఉన్నార ని 230157 పురుషులు, 247977 మంది మహి ళలు, 38 మంది ఇత రులుఉన్నారని తెలిపా రు. గత అసెంబ్లీ, పార్లమెంట్‌, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వ్యయ వివరాలు నిర్ధిష్టమైన నమోదు చేయాలని లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో అవకాశం కోల్పోతారని తెలిపారు. ఓటరు జాబితా సవరణపై సందేహాలు, ఫిర్యాదులు ఉంటే తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు రాధాబాయి, రాజేశ్వర్‌, వివిధ పార్టీల ప్రతినిధులు మూషం రమేష్‌, రమ ణ, నాగుల శ్రీనివాస్‌, సంపత్‌, రాజన్న, శేఖర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:32 AM