సాగునీటిని సమర్థవంతంగా వినియోగించాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:06 AM
ఎస్సారెస్పీ కింద యాసంగి నీటి సరఫరాకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా విని యోగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం డీ83 కాలువ కింద యాసంగి పంటకు నీటి విడుదలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సారెస్పీ కింద యాసంగికి 7 తడులలో 6 తడులను ఇప్పటికే విడుదల చేశామని తెలిపారు.

పెద్దపల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఎస్సారెస్పీ కింద యాసంగి నీటి సరఫరాకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా విని యోగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం డీ83 కాలువ కింద యాసంగి పంటకు నీటి విడుదలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సారెస్పీ కింద యాసంగికి 7 తడులలో 6 తడులను ఇప్పటికే విడుదల చేశామని తెలిపారు.
ఎస్సారెస్పీ నుంచి ఆశించిన స్థాయిలో నీరు విడుదల కాక పోవడం, ఎండ తీవ్రత వల్ల కొంత నీరు ఆవిరి కావడం వల్ల చివరి ఆయకట్టు ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదన్నారు. అందుబాటులో ఉన్న నీటి నిల్వలను అధికారులు సమన్వయంతో జాగ్రత్తగా వినియోగించుకోవాలని, నీటి వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్, మంథని ఈఈ బాల రామయ్య పాల్గొన్నారు.