Fee reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.600 కోట్లు విడుదల
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:15 AM
త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేశామని తెలిపారు. గతంలోని ఫీజుల బకాయిలను కూడా దశలవారీగా చెల్లిస్తామని పేర్కొన్నారు.

త్వరలో మరో రూ.400 కోట్లు విద్యాశాఖ కార్యదర్శి వెల్లడి
విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని యాజమాన్యాలకు హెచ్చరిక
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వం భారీ స్థాయిలో నిఽధులు విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.600 కోట్లు విడుదల చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేశామని తెలిపారు. గతంలోని ఫీజుల బకాయిలను కూడా దశలవారీగా చెల్లిస్తామని పేర్కొన్నారు. ఫీజుల కోసం విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేయరాదని ఆదేశించారు. తరగతులకు హాజరుకాకుండా నిరోధించడం, హాల్ టికెట్లు నిలిపివేయడం, పరీక్షలు రాయనీయకుండా అడ్డుపడడం వంటి చర్యలకు దిగితే.. కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే