Share News

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తెలంగాణ ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:14 AM

కృత్రిమ మేధను వ్యవసాయానికి అనుసంధానం చేసి, సాగును మరింత లాభసాటిగా మార్చడమే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తెలంగాణ ప్రాధాన్యం

  • జర్మనీ బృందంతో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, సిరిసిల్ల, మార్చి21 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధను వ్యవసాయానికి అనుసంధానం చేసి, సాగును మరింత లాభసాటిగా మార్చడమే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. జర్మనీ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఫెడరల్‌ మినిస్ర్టీ ఏషియా హెడ్‌ రెబెకా రిడ్డర్‌ ఆధ్వర్యంలో జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు. మంత్రి శ్రీధర్‌బాబును అసెంబ్లీలో శుక్రవారం కలిశారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రంగాల పరిశ్రమలను అనుసంధానించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా వివరించారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగంపై జర్మనీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని పేర్కొన్నారు.


మరోపక్క, జర్మనీకి చెందిన అంతర్జాతీయ వ్యవసాయ సహకార సంస్థ ఐఏకె అగ్రార్‌ కన్సెల్టింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్వేన్‌ గెల్హార్‌ నేతృత్వంలోని బృందం సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సె్‌స)ను శుక్రవారం సందర్శించింది. అలాగే, కోనరావుపేట మండలం మామిడిపల్లి, రామన్నపేట, శ్రీరాములపల్లె గ్రామాల్లో పర్యటించిన బృందం పలువురు రైతులతో మాట్లాడింది. సిరిసిల్లలోని 220 కేవీ విద్యుత్‌ స్టేషన్‌ను పరిశీలించింది.

Updated Date - Mar 22 , 2025 | 04:14 AM