Share News

కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:07 AM

మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు 26 వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.

 కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు

- కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల ధర్నా

సుభాష్‌నగర్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు 26 వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. చాలీచాలని జీతాలతో ఇంటి కిరాయి, పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. మున్సిపల్‌లో జవాన్లుగా కొత్తవారిని తీసుకుంటున్నారని తెలిపారు. 20 పంవత్సరాలుగా పారిశుధ్య కార్మికులుగానే పనిచేస్తున్నారని, అందులో చదువుకున్నవారు ఉన్నారని, అర్హతను బట్టి జవాన్లుగా అవకాశం కల్పించాలని కోరారు. సమానపనికి సమానవేతనం ఇవ్వాలని, మున్సిపల్‌ కార్మికులందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, నెలకు ఎనిమిది చీపుర్లు ఇవ్వాలని, కార్మికులను వేధించే జవాన్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు ఎల్‌ రూప్‌సింగ్‌, ఆకుల మల్లేశం, జిల్లా అధ్యక్షుడు దావు రాజమల్లయ్య, టౌన్‌ అధ్యక్షుడు గడ్డం సంపత్‌, కాడె చంద్రకళ, పారునంది ఎల్లయ్య, కత్తెరపాక రాజేందర్‌, బి రాజేశ్‌, ఎం జగన్‌, రాజేశ్వరి, కె స్వరూప, ఎం స్వామి, వీరస్వామి పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 01:07 AM