Share News

నిధులు లేవు.. అభివృద్ధి లేదు

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:31 AM

జిల్లాలో గ్రామ పంచాయతీలకు నిధులు కరువయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన గ్రాంట్లు రాకపోవడంతో అభివృద్ధి, పరిపాలన కుంటుపడుతున్నది. స్థానికంగా వచ్చే పన్నుల ఆధారంగానే జీత భత్యాలు చెల్లిస్తున్నారు. అత్యవసర పనులకు పంచాయతీల్లో ఒక్క రూపాయి లేక వాటిని ఎలా చేసేదని పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. తాగునీటి ఎద్దడి నివారణ, మరమ్మతు పనులకు మిషన్‌ భగీరథ నుంచి నిధులు రాక పోగా పంచాయతీల మీదే భారం మోపారు.

నిధులు లేవు.. అభివృద్ధి లేదు
గ్రామ పంచాయతీ

(ఆంఽఽధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో గ్రామ పంచాయతీలకు నిధులు కరువయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన గ్రాంట్లు రాకపోవడంతో అభివృద్ధి, పరిపాలన కుంటుపడుతున్నది. స్థానికంగా వచ్చే పన్నుల ఆధారంగానే జీత భత్యాలు చెల్లిస్తున్నారు. అత్యవసర పనులకు పంచాయతీల్లో ఒక్క రూపాయి లేక వాటిని ఎలా చేసేదని పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. తాగునీటి ఎద్దడి నివారణ, మరమ్మతు పనులకు మిషన్‌ భగీరథ నుంచి నిధులు రాక పోగా పంచాయతీల మీదే భారం మోపారు. దీంతో కొన్ని చోట్ల అత్యవసర పనులకు పంచా యతీ కార్యదర్శులు సొంతంగా నిధులు వెచ్చిస్తున్నారు. గత ఏడాది వేసవిలో క్రిటికల్‌ గ్యాప్స్‌ పనులకు కోటి 80 లక్షల రూపాయలు ప్రభు త్వం మంజూరు చేసింది. ఆ పనులు చేసి వేసవిలో ప్రజలకు తాగు నీటి ఎద్దడి లేకుండా చేసినప్పటికీ, నేటికీ కూడా ఆ పనులకు సంబం ధించిన బిల్లులు ఇంత వరకు విడుదల కాలేదు. ఏడాది కాలంగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేస్టే స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటు పడింది. ఇందుకు కారణం ఏడాది కాలంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడమేననే విమర్శలు వస్తున్నాయి.

ఫ గ్రామాల అభివృద్ధికే ఆర్థిక సంఘం నిధులు

పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేయడంతో పాటు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు నీతి అయోగ్‌ ద్వారా జనాభా ప్రాతిపదికన ప్రతి ఏటా నిధులను కేటాయి స్తారు. ఆ నిధులతో పంచాయతీల్లో విద్యుత్‌ చార్జీల చెల్లింపు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వీధుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు చేపడుతుంటారు. గతంలో ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వా నికి పంపిస్తే అక్కడి నుంచి పంచాయతీలకు పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్ల నుంచి ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిపించి నేరుగా ఆ ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంఘం 2021-22 నుంచి 2025-26 ఉంటుంది. ప్రతి ఏటా నాలుగు విడతల్లో నిధులను విడుదల చేస్తారు. ప్రతి ఏటా ఒక్కో పంచాయతీకి జనాభాను బట్టి 15వ ఆర్థిక సంఘం ద్వారా 5 నుంచి 40 లక్షల రూపా యల వరకు నిధులు వస్తున్నాయి. ఈ నిధులతో పంచాయతీల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు సద్వినియోగం చేసుకోనున్నారు.

ఫ ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలన

గత ఏడాది జనవరి నెలాఖరు వరకు గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. పిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. జూలైలో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ లు, ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. అన్ని స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసా గుతున్నది. పాలకవర్గాలు ఉన్నంత కాలమే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి నిధుల విడుదలను నిలిపి వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమా వేశాల్లో మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధుల విడు దలపై ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ చట్టబద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థలకే నిధులు విడుదల చేస్తామని, పంచాయతీలకు 2023-24లో 15వ ఆర్థిక సంఘం కేటాయించిన గ్రాంట్ల విడుదల వాయిదా పడిందని స్పష్టం చేశారు. ఏడాది కాలంగా పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించక పోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడుతున్నది. ఏడాది క్రితం ఆయా పాలక వర్గాలు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సతమతం అవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 27 , 2025 | 01:31 AM