Share News

క్రీడా పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:53 PM

అంబేద్కర్‌ స్టేడియంలోని క్రీడా పాఠశాలను కలెక్టర్‌ పమేలా సత్పతి శుక్రవారం సందర్శించారు. కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో క్రీడా పాఠశాలలో పలు వసతులు కల్పించారు. అంబేద్కర్‌ స్టేడియం, క్రీడా పాఠశాలలోని స్విమ్మింగ్‌ పూల్‌ల ఆధునికీకరణ, యోగా కేంద్రం, జిమ్నాస్టిక్స్‌, అథ్లెటిక్స్‌, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చారు.

 క్రీడా పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌
స్విమ్మింగ్‌ పూల్‌ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ పమేలా

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): అంబేద్కర్‌ స్టేడియంలోని క్రీడా పాఠశాలను కలెక్టర్‌ పమేలా సత్పతి శుక్రవారం సందర్శించారు. కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో క్రీడా పాఠశాలలో పలు వసతులు కల్పించారు. అంబేద్కర్‌ స్టేడియం, క్రీడా పాఠశాలలోని స్విమ్మింగ్‌ పూల్‌ల ఆధునికీకరణ, యోగా కేంద్రం, జిమ్నాస్టిక్స్‌, అథ్లెటిక్స్‌, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చారు. క్రీడాకారులకు వసతులు కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ క్రీడా పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ వద్ద విద్యార్థుల కోసం ఎటువంటి అవసరం ఉన్నా సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సదుపాయాలను వినియోగించుకొని క్రీడారంగంలో మరింత రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యా ర్థుల అథ్లెటిక్స్‌, యోగా జూడో, జిమ్నాస్టిక్స్‌ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అడిషన ల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, ట్రైనీ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:53 PM