ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం ఇప్పించండి
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:47 PM
మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు చట్ట మొగిళి, గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం హైదారాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

చిగురుమామిడి,మార్చి 29(ఆంద్రజ్యోతి): మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు చట్ట మొగిళి, గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం హైదారాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 685లో ప్రభుత్వ భూమి కొనుగోలు కేంద్రం కోసం కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. స్థలం ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామైఖ్య సంఘం అధ్యక్షులు దేశిని జ్యోతి, సొల్లు రజిత, మైలగాని సూజాత, చట్ల మానస, మామిడి రమ, మాజీ ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపల్లి ఆదర్శ్, కొంకట భిక్షపతి, చట్ల వెంకటరాజం, రైతు సంఘం అధ్యక్షుడు కత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.