మాధకద్రవ్యాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:35 AM
మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మత్తు పదార్థాల నిర్మూనలో భాగంగా కలెక్టరేట్‌లో పోలీస్, ఎక్సైజ్ సహ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

కరీంనగర్ క్రైం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మత్తు పదార్థాల నిర్మూనలో భాగంగా కలెక్టరేట్‌లో పోలీస్, ఎక్సైజ్ సహ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో కళాశాలలు, వవిధ వసతి గృహాలను సందర్శించాలన్నారు. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులు పెడదోవ పట్టకుండా చూడాలని ఆదేశించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థుల వ్యవహార శైలిని గమనించాలన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ పోలీసుశాఖ తరపున అధికారులందరి సమన్వయంతో ఇప్పటికే జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, ఎక్సైజ్ జిల్లా సూపరిటెండెంట్ పి శ్రీనివాసరావు, ఏసీపీ మాధవి, డీడబ్ల్యువో సబిత, డీఈవో జనార్దన్, డీఎంహెచ్‌వో వెంకటరమణ పాల్గొన్నారు.