సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టడానికి వీలు లేదు
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:49 AM
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడానికి వీలు లేదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.

సిరిసిల్ల, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడానికి వీలు లేదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం రాజ న్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబా బు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుస్రం నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్‌ల తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాకు వచ్చిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు ఉదయం మేములవాడ రాజరాజేశ్వ ర స్వామి దర్శించుకున్నారు. కలెక్టరేట్‌లో చై ర్మన్‌తో పాటు సభ్యులను కలెక్టర్ స్వాగతిం చారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలుచేస్తున్న ప్రభుత్వ కార్యక్రమా ల వివరాలను, విద్య, వైద్యం సంక్షేమ రంగం లో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకట య్య మాట్లాడుతూ పంచాయతీ రాజ్, రోడ్డు భవనాలు, ముఖ్య ప్రణాళిక అధికారి పరిధి లో ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టవద్దని, ఎక్కడైనా ని ధులు దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లాలో షెడ్యూల్ కులా లు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్య లు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 4,313 ఎకరాలకు సంబంధించి 6,029 మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చే సుకోగా, 1,614 మంది రైతులకు 2,860 ఎక రాలను పంపిణీ జరిగిందన్నారు. పెండింగ్ ఆర్‌వోఎఫ్‌ఆర్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్టీ రైతు లందరికీ పట్టాలు అందాలని 10 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అ టవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాల ని సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి చేప ట్టిన పనులకు రూ.1.08 కోట్ల నిధులను మం జూరు కోసం సింగరేణికి రాసామని అధికా రులు తెలుపగా, సంబంధిత వివరాలు అంది స్తే సింగరేణి సీఎండీతో మాట్లాడి నిధులు వెంటనే మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీఇచ్చారు. సబ్సిడీ కింద ప్రభుత్వం మం జూరుచేసే మొత్తం సద్వినియోగం జరిగి యూనిట్లకు గ్రౌండింగ్ అయ్యే విధంగా ప్ర త్యేక చొరవ చూపాలన్నారు. సీఎంవో కార్యా లయంలో సిరిసిల్ల కలెక్టర్, జిల్లా అధికారులు బాగా పనిచేస్తున్నారని మంచి పేరు ఉందని, ఆ పేరు కాపాడుకోవాలని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అభినందనీయం..
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య గ ణనీయంగా పెరిగిందని, ఎటువంటి మరణా లు లేకుండా మాతా శిశు ఆసుపత్రిలో ప్రస వాలను విజయవంతంగా నిర్వహిస్తున్న వై ద్యబృందానికి కమిషన్ చైర్మన్ అభినందనలు తెలిపారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసు కుంటున్నారని అభినందించారు. ప్రభుత్వ పా ఠశాలలు, హాస్టల్స్‌లలో విద్యార్థుల రక్షణకు, కుక్కలు, కోతుల సమస్య పరిష్కారం కోసం సోలార్ ప్యానల్ ఫెన్సింగ్ ఏర్పాటు ప్రతిపాద నలు 7రోజుల్లో సిద్ధం చేయాలని చైర్మన్ ఆదే శించారు. జిల్లాలో పెండింగ్ ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులను జిల్లా అధి కారులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనంగా సన్మానించారు. ప్రజల నుండి వారి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషా ద్రినిరెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారీ రాధా బాయి, డీఎస్పీ చంద్ర శేఖర్‌రెడ్డి, జిల్లా అధి కారులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.