కల్యాణ వైభోగమే..
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:57 AM
వైభవోపేతంగా జరిపే వివాహ మహోత్సవాలంటే ఇప్ప టికీ ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలు మక్కువ చూపుతారు. అందులో ధర్మబద్ధంగా నడుచుకోవడం ద్వారా స్త్రీ, పురుషులు తమ వైవాహిక జీవితాన్ని ఎలా అనుభవించాలో శ్రీరాముడే స్వయంగా ఆచరించి చూపించాడు.

రామయ్య తలంబ్రాలు.. శివుడిని పెళ్లాడే శివపార్వతులు..
రాజన్న క్షేత్రానికి ‘ధారణ’కు తరలివచ్చిన శివపార్వతులు
డు వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణ ం
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
వైభవోపేతంగా జరిపే వివాహ మహోత్సవాలంటే ఇప్ప టికీ ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలు మక్కువ చూపుతారు. అందులో ధర్మబద్ధంగా నడుచుకోవడం ద్వారా స్త్రీ, పురుషులు తమ వైవాహిక జీవితాన్ని ఎలా అనుభవించాలో శ్రీరాముడే స్వయంగా ఆచరించి చూపించాడు. బలము, యశస్సు, సంపద, జ్ఞానము, సౌందర్యం, వైరాగ్యం వంటి గుణాలతో సంపూర్ణత కలిగిన సీతారాముల కల్యాణం చూడడానికి ఎక్కడికైనా తరలివెళ్తారు. కానీ సీతారాముల తలంబ్రాల వేళ.. ధర్మ ప్రచారకులుగా ఉన్న శివపార్వతులు శివుడే పెనిమిటిగా తమ వివాహాలను పునరుద్ధరించుకునే వేడుక కూడా చూడాల్సిందే.
ఆదివారం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం సన్నిధిలో త్రిశూలం గంటల మోత.. వర్షపు జల్లుగా కురిసే తలంబ్రా లు శివసత్తుల పూనకాలతో దద్దరిల్లిపోయే ఆసన్నివేశాలు మహా అద్భుతాలుగానే చెప్పుకోవచ్చు. ఈ పెళ్లి తంతును జంగాలు గా పరిగణించే వీరశైవులు నిర్వహిస్తారు. రుద్రక్షే మం గళసూత్రంగా కాళ్లకు రాగి మట్టెలు, చేతికి త్రిశూలాన్ని ఇచ్చి పెళ్లి తంతు జరిపిస్తారు.
ఫ ఆగని ధారణ..
లోకజ్ఞానం తెలియని ఆడ పిల్లలను సైతం శివ పార్వతులుగా శివుడి తో పెళ్లి చేసే తంతు వేములవాడ వేదికగా ‘ధారణ’ పేరుతో సాగి పోతునే ఉంది. స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ యంత్రాంగం కూడా చిన్నా రులకు పెళ్లి తంతు నిర్వహించవద్దని కౌన్సెలింగ్ చేసినా ఆచారం మాత్రం కొనసాగుతూనే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, కొమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్, జనగామ, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల్లోని ప్రతి ప్రాంతంలోనూ శివపార్వతులుగా మారిన స్త్రీ, పురుషులు, పిల్లలు సైతం తరలివస్తారు. ఆడ, మగ తేడా లేకుండా శివపార్వతులుగా మారుతున్న తీరును తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు కొంతమేరకు ఫలితాలు ఇస్తున్నాయి.
ఫ పెళ్లిల పునరుద్ధరణ..
శ్రీరామనవమి రోజున ఆలయ ప్రాంగణంలో జరిగే కల్యాణం వేళ వీరు ఎక్కడ ఉన్నా వేములవాడకు వచ్చి శివుడితో వివాహం చేసుకు న్నట్లు పెళ్లి తంతును నిర్వహిస్తారు. ప్రతిఏటా శ్రీరామ నవమి రోజు లక్షల మంది శివపార్వతులు తమ పెళ్లిలను పునరుద్ధరించుకుంటారు. సీతారాముల కల్యాణం జరుగుతుండగా జంగమయ్య ఆధ్వర్యంలో పెళ్లి తంతు నిర్వహించుకుంటారు. కొత్త బట్టలు ధరించి, నుదుట పెద్ద బొట్టు, బాసికాలు, తలపై జీలకర్ర, బెల్లం, చేతిలో త్రిశూలం ధరించి జోలె పట్టుకొని అక్షింతలు పట్టుకొని దేవునితో తమ వివాహం చేసుకుంటారు. తాహతు మేరకు కట్నాలు కూడా చదివిస్తారు. పెళ్లిలు చేసు కొని పిల్లాపాపలతో కుటుంబ జీవనం గడుపుతూనే శివపార్వతులుగా మారిన వారు కూడా ఉంటారు. అనారోగ్యానికి గురైనప్పుడు దేవుడికి మొక్కుగా మారిన తదనంతర కాలంలో శివపార్వతులుగా మారిపోతున్నట్లు వారు చెబుతుంటారు.
వేములవాడ దేవస్థానంలో జరిగే ఈ శివపార్వతుల పెళ్లి తంతును జంగాలుగా పరిగణింపబడే వీర శైవులు నిర్వహిస్తారు. శివపార్వతిగా మారేవారికి జంగమయ్యనే మెడలో రాగి మంగళ సూత్రం, కాళ్లకు రాగి మట్టెలు తొడిగి స్త్రీ, పురుష భేదం లేకుండా చీర కటిస్తారు. చేతికి త్రిశూలాన్ని ఇచ్చి శివుడితో పెళ్లి జరిపిస్తారు. దీంతో ఆయా స్త్రీ, పురుషు లు శివ పార్వతులుగా మారినట్టు భావిస్తారు. ఆనాటి నుంచి వారు ఆది భిక్షువుగా చెప్పుకునే శివుడి అడుగుజాడల్లో నడుస్తూ భిక్షాటన చేస్తారు. ఒకసారి శివుడితో పెళ్లి చేసుకున్న తరువాత శివుడి భార్యగానే కొన సాగుతారు. ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన స్థితిలో ఉన్న వారు తమ మామూలు జీవితంలో పెళ్లిలు చేసుకొని సంసారాలు చేస్తూనే శివపార్వతులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. వీరు ప్రతియేటా శ్రీ రామనవమికి వేములవాడ స్వామి వద్దకు వచ్చి పెళ్లిని పునరుద్ధరించు కుంటారు. శివపార్వతులు పెళ్లిలు చేసుకొని పిల్లాపాపలతో కుటుంబ జీవనం గడుపుతూనే శివున్ని పెళ్లాడుతూ ఉంటారు. ఈ మధ్య కాలం లో హిజ్రాలు ఎక్కువ సంఖ్యలో శ్రీరామ నవమి రోజు వేములవాడకు రావడం కూడా కొన్ని సందర్భాల్లో వివాదాస్పదంగా మారుతోంది. శివపార్వతులు వేములవాడ ఆలయ ప్రత్యేకతను చాటుతూ ఽధార్మిక ప్రచార కులుగా కూడా ఎనలేని సేవలను అందిస్తున్నారు.