న్యాయవాదుల విధుల బహిష్కరణ..
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:51 AM
హైదరాబాద్ చంపాపేట్ ప్రాంతంలో న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ సిరిసిల్ల కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు బహిష్కరించి నిరసన తెలిపారు.

సిరిసిల్ల క్రైం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ చంపాపేట్ ప్రాంతంలో న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ సిరిసిల్ల కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సంజీవరెడ్డి, కార్యదర్శి వెంకటి సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
వేములవాడ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : వేములవాడలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించారు. వేములవాడ బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల గౌడ్, కే.విద్యాసాగర్‌రావు, రేగుల దేవేందర్, పొత్తూరు అనిల్ కుమార్, పిట్టల మనోహర్, పెంట రాజు, కే.పురుషోత్తం, గోపికృష్ణ, ప్రతాప సంతోష్, గడ్డం సత్యనారాయణరెడ్డి, గోగికారి శ్రీనివాస్, గొంటి శంకర్, కటకం జనార్ధన్, రేగుల రాజకుమార్, గుజ్జే మనోహర్, పంపరి శంకరయ్య, అనిల్, వడ్లకొండ శ్రీకాంత్, కనికరపు శ్రీనివాస్, హరీష్, నాగేంద్రబాబు పొత్తూరి మల్లేష్, జెనార్ధన్, మహిళా న్యాయ వాదులు అన్నపూర్ణ పాల్గొన్నారు.