Share News

రౌడీ షీటర్ల హిస్టరీపై దృష్టి పెట్టాలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:49 AM

సైబర్‌నేరాలు, అక్రమ గేమింగ్‌, బె ట్టింగ్‌ యాప్స్‌పై దృష్టి పెట్టడమే కాకుండా రౌడీ షీటర్ల హిస్టరీపై నిఘా పెట్టాల ని ఎస్పీ మహేష్‌ బి గీతె అన్నారు.

రౌడీ షీటర్ల హిస్టరీపై దృష్టి పెట్టాలి

కోనరావుపేట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : సైబర్‌నేరాలు, అక్రమ గేమింగ్‌, బె ట్టింగ్‌ యాప్స్‌పై దృష్టి పెట్టడమే కాకుండా రౌడీ షీటర్ల హిస్టరీపై నిఘా పెట్టాల ని ఎస్పీ మహేష్‌ బి గీతె అన్నారు. కోనరావుపేట పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు ఈసందర్భంగా స్టేషన్‌ ఆవరణలో పలు కేసుల్లో స్వాధీనం చేసు కున్న వాహనాల వివరాలు, స్టేషన్‌ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసు ల వివరాలు, స్టేషన్‌ రికార్డులు పరిశీలించి, పెండింగ్‌ కేసులపై ఆరాతీసి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. బ్లూకోల్ట్స్‌, పెట్రో కార్‌ సిబ్బంది 100 డయల్‌ కాల్స్‌కి తక్షణమే స్పందిస్తూ సంఘ టనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అధికా రులు, సిబ్బంది పెట్రోలింగ్‌ సమయంలో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న రౌడీషీట ర్లను, హిస్టరీ షీటర్స్‌లను అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా ఉంచు తూ తనిఖీ చేయాలని అన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా అధికారులు, విలేజ్‌ పోలీస్‌ అధికారులు ప్రజలకు, యువతకు సైబర్‌ నేరాలపై, అక్రమ బెట్టిం గ్‌, గేమింగ్‌ యాప్స్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఈసీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ప్రశాంత్‌రెడ్డి, ట్రెనీ ఎస్‌ఐ రాహుల్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:49 AM