మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:47 AM
ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

వేములవాడ రూరల్, మార్చి 25(ఆంధ్రజ్యోతి) : ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. హన్మాజిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేషెం ట్ల వివరాల గూర్చి ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలోని విభాగాలను, ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అవసరమమ్యే మందు లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం గ్రామంలో ని పశువైద్యశాలలో ఉన్న వ్యాక్సిన్ల వివరాలను తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజనం తయారీ పరిశీలన
హన్మాజిపేటలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను, లింగంపల్లి, హన్మాజి పేట అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తనిఖీ చేశా రు. మధ్యాహ్న భోజనం తయారీ విధానం, స్టోర్ రూం, తరగతి గదుల ను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించిన ఆయన పరీక్షలకు స న్నద్ధం కావాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎంత మంది పిల్లలు న్నారు. కేంద్రాల పరిధిలో ఎంతమంది గర్భిణులు, బాలింతలు ఉన్నారో వివరాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్‌లను పరిశలించా రు. ఆయన వెంట వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు ఉన్నారు.