బ్రహ్మోత్సవాల సందడి ఏది?
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:34 AM
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు సమీపిస్తున్నా ఎటువంటి సందడి కనిపించడం లేదు. ఇప్పటి వకు కనీసం వాల్ పోస్టర్‌నూ ఆవిష్కరించలేదు. ప్రచార రథాలనూ ప్రారంభించలేదు. ప్రతి ఏటా 15రోజుల ముందే వాల్ పోస్టర్లు ఆవిష్కరించి, ప్రచార రథాలు ప్రారంభించేవాళ్లు. ఈ యేడాది ఎటువంటి కదిలికా కనిపించడం లేదు.

ఇల్లందకుంట, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు సమీపిస్తున్నా ఎటువంటి సందడి కనిపించడం లేదు. ఇప్పటి వకు కనీసం వాల్ పోస్టర్‌నూ ఆవిష్కరించలేదు. ప్రచార రథాలనూ ప్రారంభించలేదు. ప్రతి ఏటా 15రోజుల ముందే వాల్ పోస్టర్లు ఆవిష్కరించి, ప్రచార రథాలు ప్రారంభించేవాళ్లు. ఈ యేడాది ఎటువంటి కదిలికా కనిపించడం లేదు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ నియమించాలని కాంగ్రెస్ నాయకులు మంత్రులకు లేఖలు రాశాలు. ఇప్పటికీ కమిటీల ఏర్పాటుపై ఎటువంటి ప్రకటనా రాలేదు. వాల్ పోస్టర్‌పై కమిటీ మెంబర్ల పేర్లు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి పోస్టర్ ఆవిష్కరించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆలయ ఇన్‌చార్జి ఈవో కందుల సుధాకర్‌ను వివరణ కోరగా సోమవారం జిల్లా మంత్రుల వద్దకు వెళ్లి పోస్టర్ ఆవిష్కరిస్తామని తెలిపారు. వెంటనే ప్రచార రథాలు కూడా ప్రారంభిస్తామ్నారు.
ఫ ప్రచార రథాలు ఎప్పుడు ప్రారంభిస్తారు..
- కొత్త శ్రీనివాస్, ఇల్లందకుంట
మరో నాలుగు రోజులైతే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కానీ ఇప్పటి వరకు ప్రచార రథాలు ప్రారంభించలేదు. ఇతర జిల్లాల నుంచి భక్తులు స్వామివారి కల్యాణానికి అధిక సంఖ్యలో వస్తారు. భక్తులకు సమాచారం అందించడంలో అధికారులు జాప్యం చేయడం సరికాదు.
ఫ మూమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమే.
- నన్నబోయిన రవియాదవ్, లక్ష్మాజిపల్లె
స్వామివారి కల్యాణానికి, బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేయకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. భక్తులు ప్రతి ఏటా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణ, పట్టాభిషేకం, ,చిన్నరథం, పెద్దరథానికి పెద్ద ఎత్తున తరలివస్తారు. కొందరు భక్తులు వాల్ పోస్టర్‌లో కార్యక్రమాలను తెలుసుకుని హాజరవుతారు. ఇప్పటికైనా ఏర్పాట్లు త్వరగా చేయాలి.