KTR: నేను కేసీఆర్ అంత మంచోణ్ణి కాదు
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:56 AM
ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. విదేశాలకు వెళ్లిన వారిని సైతం వదిలేది లేదు’ అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఎవడు పడితే వాడు.. భూమికి జానెడు.. మూడు ఫీట్ల ఎత్తున్నోడు ఎగిరెగిరి పడుతూ కేసీఆర్ గురించి మా ట్లాడుతున్నారని మండిపడ్డారు.

రాసి పెట్టండి.. ఏ ఒక్కర్నీ వదిలేది లేదు
మళ్లీ మన రాజ్యం వస్తుంది
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం
వరంగల్‌లో రజతోత్సవ సభతో
సన్నాసుల నోళ్లు మూతపడాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కరీంనగర్ టౌన్/సిరిసిల్ల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రె్‌సను గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ.. నిర్బంధం.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టగానే కేసులు పెడుతున్నారు! మళ్లీ మన రాజ్యం వస్తుంది.. నేను కేసీఆర్ అంత మంచివాణ్ణి కాదు.. రాసిపెట్టండి. ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. విదేశాలకు వెళ్లిన వారిని సైతం వదిలేది లేదు’ అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఎవడు పడితే వాడు.. భూమికి జానెడు.. మూడు ఫీట్ల ఎత్తున్నోడు ఎగిరెగిరి పడుతూ కేసీఆర్ గురించి మా ట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి రంగంతా బయటపడుతుందని, ప్రజలు ఉరికించి కొట్టే రోజులు వస్తాయన్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాన్ని కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, ఏ రైతును కదిలించినా కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయని, కేసీఆర్ ఉన్నపుడే బాగుండేదంటున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని బీజేపీ చూస్తోందని, దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని, అందులో మూడు ముఖ్యమైనవి అసూయ, ద్వేషం, ఆశ అని అ న్నారు. కేసీఆర్ సీఎం అయిన రోజున 5 లక్షలు ఉన్న ఎకరం భూమి ధర.. ఆయన దిగిపోయే రోజు 50 లక్షలకు చేరిందన్నారు. కేసీఆర్ పాలనలో స్థానిక నాయకు లు ఇల్లు, కారు కొనుక్కుంటే ఆ సంపాదన ను చూపించి మంత్రు లు, కేసీఆర్, కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని కాంగ్రెస్, బీ జేపీలు ప్రజల్లో అసూ య కలిగించే ప్రచారం చేశాయని విమర్శించారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చించే సత్తా లేక దొర అంటూ ఆయనను కలవడం కష్టమని, ఫామ్‌హౌ్‌సలో దోచుకున్న సంపద దా చుకున్నాడని ద్వేషం పెంచారన్నారు. కాంగ్రెస్ అమలు కానీ హామీలతో ప్రజల్లో ఆశలు రేపి... అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలో ఉండగా కొన్ని తప్పులు, లోపాలు జరిగాయని, వాటిని సరిదిద్దుకుంటామని చెప్పారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో పార్టీ రజతోత్సవాలను బీఆర్‌ఎస్ ఖతమైందన్న సన్నాసుల నోళ్లు మూతపడేలా జరుపుకొందామని ఆయన అన్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్త బైక్ ఢీకొని మహిళా కానిస్టేబుల్‌కు గాయాలు
కరీంనగర్ క్రైం: కేటీఆర్ పర్యటన సందర్భంగా కరీంనగర్‌లో చేపట్టిన బైక్ ర్యాలీలో పుల్ల శ్రీకాంత్ అనే బీఆర్‌ఎస్ కార్యకర్త బుల్లెట్ అదుపుతప్పి గుండాల పద్మజ అనే కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లడంతో ఆమె గాయపడింది. ఆమె పాదంలో ఎముక విరిగింది. పోలీసులు శ్రీకాంత్‌పై కేసు నమోదు చేశారు. కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి పద్మజను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.