42శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:20 PM
రాష్ట్రంలోని బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాసులు పేర్కొన్నారు.

పాలమూరు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్యతో కలిసి మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ అధికారికంగా అమలు చేయటానికి పార్లమెంట్‌లో చట్టం చేసి కార్యరూపం దాల్చాలన్నారు. దానికోసం షెడ్యూల్ 9లో పొందుపరచాలన్నారు. అర్టికల్ 31లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42శాతం రిజర్వేషన్ చట్టం చేసి అమలు చేయటానికి కలిసి రావాలన్నారు. కుమ్మరి సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, పద్మశాలి సంఘం అధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్, ఆర్యమరాఠా సంఘం అధ్యక్షుడు జాజం సుబ్రహ్మణ్యం, అంజయ్య, ప్రభాకర్, హరిప్రసాద్, బిక్షపతి పాల్గొన్నారు.