Share News

కొలతల ప్రకారం పనులు చేయాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:37 PM

ప్రతీ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం లో భాగంగా కూలీ పనులు ప్రారంభించాలని అ దనపు కలెక్టర్‌ నరసింగరావు అన్నారు.

కొలతల ప్రకారం పనులు చేయాలి

- కలుకుంట్లలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

మానవపాడు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ప్రతీ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం లో భాగంగా కూలీ పనులు ప్రారంభించాలని అ దనపు కలెక్టర్‌ నరసింగరావు అన్నారు. శుక్రవా రం మండల పరిధిలోని కలుకుంట్ల గ్రామంలో అదనపు కలెక్టర్‌ నరసింగ రావు పర్యటించి గ్రా మంలోని నర్సరీని పరిశీలలించారు. అనంతరం ఉపాధి పనులు జరుగుతున్న దగ్గరికి వెళ్లి పను లను పరిశీలించారు. ప్రతీ ఒక్కరు కొలతల ప్ర కారం పనులు చేసుకుని రూ.300 కూలీ పొందా లని చెప్పారు. కూలీలకు సదుపాయాలు మండ ల అధికారులు కల్పించాలని సూచించారు. ఎం డల తీవ్రను దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశం లో టెంట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాలు ఉంచాలని అధికారులను ఆదేశించారు. విధుల పట్లు నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Mar 21 , 2025 | 11:37 PM