న్యాయపరమైన హక్కులపై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:37 PM
న్యాయపరమైన హక్కులపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సెక్రటరీ డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గంటా కవితాదేవి అన్నారు.

గద్వాల క్రైం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): న్యాయపరమైన హక్కులపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సెక్రటరీ డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గంటా కవితాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ఆసుపత్రిలో శుక్రవారం మానసిక ఆరోగ్యం- న్యాయపరమైన సమస్యల గురించి సమీక్షా సమావేశాన్ని ఆసు పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిర ఆధ్వ ర్యంలో పేషంట్లకు, ట్రైనీ విద్యార్థులకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంటా కవితాదేవి హాజరై మాట్లాడుతూ... మానసిక రోగులు, బుద్ధిమాంద్యం గల వ్యక్తులు వాళ్ల మానసికస్థితి వల్ల చాలాసార్లు న్యాయపరమైన హక్కులు వినియోగించుకోలేకపోతున్నారన్నారు. దానికి కారణం వాళ్ల స్థితి మిగితా వారితో పోలిస్తే భిన్నమైందన్నారు. నిర్ణయం తీసుకునే శక్తి పూర్తిస్ధాయిలో లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నాల్సా చట్టం ద్వారా అటువంటి రోగులకు వైద్యబృం దం పూర్తి సహకారం, న్యాయసేవలు లీగల్ సర్వీసెస్ యూనిట్ మనోన్యాయ్ ద్వారా ఏర్పా టు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సిద్దప్ప, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి సంధ్యాకిరణ్మయి, డాక్టర్ వృశాలి, ఎన్సీడీ కోఆర్టినేటర్ శ్యాంసుందర్, మానసిక ఆరోగ్య నిపుణులు ప్రదీప్‌కుమార్ తదితరులు ఉన్నారు.